రూ.500 కొత్త నోట్ల ఇష్యూ: విత్‌డ్రాయల్ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: బ్యాంకులు ఆదివారంనాడు కొత్త 500 రూపాయల నోట్లను కూడా ఇచ్చాయి. ఢిల్లీ, భోపాల్, ముంబైల్లోని బ్యాంకుల్లో ఈ నోట్లను ఇచ్చారు. అయితే, ఎటిఎంల నుంచి ఈ నోట్లు విడుదల కావడానికి ఇంకా సమయం పడుతుంది.
ఆదివారం ఉదయం నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ (సిఎన్‌పి) కొత్త 500 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంకుకు తరలించే పనిని ప్రారంభించింది. తొలి విడతగా ఐదు మిలియన్ల కొత్త ఐదు వందల నోట్ల పీస్‌లను తరలించింది.

మరో ఐదు మిలియన్ల పీసెస్‌ను బుధవారం పంపిస్తుంది. దీంతో దేశంలోని కొన్ని ప్రాంతాలకు కొంత మేర ఊరట లభించింది. రూ.500 నోట్ల జారీతో బ్యాంకుల్లో పని కాస్తే వేగాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. వంద రూపాయల నోట్లు ఇవ్వడానికి చాలా సమయం పడుతోందని, ఐదు వందల రూపాయల నోట్ల వల్ల పని వేగం అందుకుంటుందని బ్యాంకు ఉద్యోగులు అంటున్నారు.
ఇదిలావుంటే ఎటిఎంల నుంచి విత్‌డ్రా చేసుకుని డబ్బు పరిమితిని రోజుకు రూ.2000 నుంచి 2500 వరకు పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు కౌంటర్ల మార్పిడి చేసుకునే డబ్బును రూ.4000 నుంచి 4,500కు పెంచింది.
తన నిర్ణయాన్ని స్వాగతించిన ప్రతీ భారతీయుడికి సలాం చేస్తున్నట్టుగా తెలిపారు మోడీ.తన జీవితం ప్రజల కోసమే అంకితమని, ప్రజల కోసమే జీవిస్తానని, ప్రజల కోసమే మరణిస్తానని ప్రకటించారు. రాత్రికి రాత్రి తాను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన కోట్లాది మంది ప్రశాంతంగా నిద్రపోగా, ఇంట్లో నల్లధనాన్ని ఉంచుకున్న వారికి మాత్రమే నిద్రలేకుండా పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications