వచ్చే వారం సెలవుల జాతర..ఏకంగా నాలుగు రోజులు

పండుగల సీజన్ మొదలైందంటే చాలు.. సెలవులకు కొదవే ఉండదు. ఇప్పటికే దసరా సెలవులతో హడావిడి ముగియగా, ఇప్పుడు దేశంలో మరో అతిపెద్ద పండుగ దీపావళి సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ వినియోగదారులకు షాకిస్తూ.. కొన్ని ప్రాంతాలలో బ్యాంకులకు భారీగా వరుస సెలవులు వస్తున్నాయి.

సాధారణంగా ఆర్థిక లావాదేవీలకు, రోజువారీ అవసరాలకు బ్యాంకు సేవలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే బ్యాంకు సెలవులు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకోవడం తప్పనిసరి.

Banks to Remain Closed for 4 Consecutive Days from October 19 in Gorakhpur

ఉత్తరప్రదేశ్‌లో ఊహించని సెలవుల పరంపర
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన సెలవులకు తోడుగా, స్థానిక పండుగల కారణంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు అదనపు సెలవులు తీసుకుంటాయి. ఈ క్రమంలోనే, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు బంద్ కానున్నాయి.

వచ్చే వారం దీపావళి పండుగతో పాటు స్థానికంగా ఉన్న పెద్ద పండుగల కారణంగా గోరఖ్‌పూర్ ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.

ఎప్పుడెప్పుడు సెలవులు?
అక్టోబర్ 19వ తేదీ (ఆదివారం) నుంచి 23వ తేదీ (గురువారం) మధ్య ఈ నాలుగు రోజుల సెలవులు వస్తున్నాయి.

అక్టోబర్ 19: ఆదివారం (వారపు సెలవు)

అక్టోబర్ 20: సోమవారం (దీపావళి పండుగ)

అక్టోబర్ 21: మంగళవారం (ఒక్క రోజు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి)

అక్టోబర్ 22: బుధవారం (గోవర్ధన్ పూజ)

అక్టోబర్ 23: గురువారం (భయ్యా దూజ్, చిత్రగుప్త పూజ)

ఈ లెక్కన చూస్తే.. ఆదివారం నుంచి మొదలయ్యే ఈ సెలవుల్లో మధ్యలో ఒక్క రోజు మాత్రమే బ్యాంక్ తెరుచుకుంటుంది. అంటే, మొత్తం ఐదు రోజుల్లో కేవలం ఒక రోజు మాత్రమే లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుంది.

గోరఖ్‌పూర్‌లో దీపావళి తర్వాత వచ్చే గోవర్ధన్ పూజ, భయ్యా దూజ్ పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగలకు సెలవులు ప్రకటించినట్లు ఉత్తరప్రదేశ్‌ బ్యాంక్ ఉద్యోగుల సంఘం గోరఖ్‌పూర్ అధ్యక్షుడు అశుతోష్ సింగ్ తెలిపారు.

కాబట్టి, గోరఖ్‌పూర్ ప్రాంతంలోని బ్యాంక్ కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని.. తమ అత్యవసర లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+