చిల్లర కోసం చిన్నారి ప్రాణాలు తీశారు
ముంబాయి :చిల్లర కష్టాలు చిన్నారి ప్రాణాలను తీశాయి. రద్దు చేసిన నగదును తీసుకోవాలని కేంద్రం ఆదేశించినా ఆసుపత్రుల యజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయి. ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ప్రాణం కోల్పోయింది. చిన్నారిని కోల్పోయిన తల్లిదంద్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకరఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
పెద్ద నగదునోట్ల రద్దు నల్లధనాన్ని అరికట్టే అవకాశం ఉండవచ్చు. కాని ఈ నోట్ల రద్దుకారణంగా సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రానాలమ మీదకు వచ్చిన సమయంలో కూడ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. ఆసుపత్రుల బయటే కేంద్రం రద్దు చేసిన నగదును తీసుకోమని ఆసుపత్రుల యాజమాన్యాలు బోర్డులు ప్రదర్శిస్తున్నాయి.

ముంబైకి చెందిన జగదీశ్, కిరణ్ శర్మ దంపతులకు బుదవారం నాడు బిడ్డ పుట్టింది. ఇంటి వద్దే కిరణ్ శర్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది.పుట్టిన వెంటను ఆ చిన్నారి అస్వస్థతకు గురైంది. తీవ్రంగా జ్వరం రావడంతో చిన్నారిని కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు.ఆసుపత్రి యాజమన్యం మాత్రం రద్దు చేసన నగదు నోట్లను తీసుకొనేందుకు నిరాకరించారు.
ఆసుపత్రిలో చిన్నారిని చేర్చుకోవడానికి ఆరు వేల రూపాయాలను డిపాజిట్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యం కొరింది. జగదీష్ వద్ద రద్దు చేసిన నగదు మాత్రమే ఉంది. చిల్లర నగదు ఆయన వద్ద లేవు. పెద్ద నగదును మార్చుకోనే పరిస్థితి లేదు. చిల్లర నగదును తెస్తేనే ఆసుపత్రిలో చేర్చుకొంటామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది.వేరే ఆసుపత్రి తీసుకెళ్ళే సమయం లేదు. ఈ లోపుగా చిన్నారి మరణించిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆసుపత్రి నిర్వాకంపై జగదీష్ దంపతులు పిర్యాదు చేశారు. జగదీష్ ఫిర్యాదులో వాస్తవం లేదని ఆసుపత్రివర్గాలు ఖండించాయి.












Click it and Unblock the Notifications