కత్తెర కాదు: కొవ్వొత్తుల మంటతో హెయిర్ కట్ (వీడియో)
గుల్బర్గా: ముఖం అందంగా కనపడటంలో జుట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందమైన కేశాలు ముఖానికి కొత్త వెలుగు నిస్తాయి. మన సినిమా హీరోలు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి విమానంలో ముంబై వెళ్లి వస్తుంటారు.
హెయిర్ కటింగ్ చెయ్యడానికి ఎక్కడైనా కత్తెర ఉపయోగిస్తారు. అయితే కత్తెరకు బదులు కొవ్వొత్తి మంటతో హెయిర్ కటింగ్ చెయ్యడం ఎక్కడైనా చూశారా ? చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా ? అయితే మీరే చూడండి.
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని షహబాద్ అనే ప్రాంతంలో రాజ్ మెన్స్ సెలూన్ నడుపుతున్నారు. ఈ సెలూన్ యజమాని దశరథ్. ఈయన హెయిర్ కటింగ్ చెయ్యడానికి కత్తెరకు బదులు కొవ్వొత్తి మంటను ఉపయోగిస్తున్నారు.

కొవ్వొత్తి వెలిగించి ఆ మంటతో హెయిర్ కటింగ్ చేస్తున్నారు. హెయిర్ కటింగ్ చేసుకోవడానికి వస్తున్న వారు మొదట వెనకడుగు వేశారు. అయితే ఆయన దగ్గర కేశాలంకరణ చేసుకున్న వారు తమ అందమైన జుట్టు చూసుకున్న తరువాత ఇప్పుడు ఆ సెలూన్ కు క్యూకడుతున్నారు.
ఆ రోజుల్లో మా ఊళ్లో ఎక్కువగా కరెంట్ పోవడం వలన తనకు ఈ ఆలోచన వచ్చిందని దశరథ్ అంటున్నారు. అందరూ కత్తెరతో క్రాఫ్ చేస్తుంటే దశరథ్ కొవ్వొత్తి మంటతో క్రాఫ్ చేస్తున్నారని ఆయన దగ్గరకు హెయిర్ కట్ చేసుకోవడానికి వెలుతున్న వారు ఎంజాయ్ చేస్తున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications