సెక్స్ చేస్తుండగా.. టార్చర్ తట్టుకోలేక యువకుడి గొంతు కోసి చంపిన మహిళ..!
బ్లాక్ మెయిల్ చేసి సెక్స్ చేస్తుండగా అతడి టార్చర్ తట్టుకోలేక గొంతుకోసి చంపింది ఓ మహిళ. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏం జరిగింది..?
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బరేలీకి చెందిన ఇక్బాల్ ఓ చీరల వ్యాపారి. గ్రామాలు తిరుగుతూ చీరలు విక్రయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ మహిళకు ఇక్బాల్ కు మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఒకరోజు ఇక్బాల్ ఆ మహిళకు ఫోన్ చేసి తన ఇంటికి రమ్మన్నాడు. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి.. అవి బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లోబరుచుకున్నాడు. ఇక పదే పదే ఫోన్లు చేసి సెక్స్ లో పాల్గొనాలని వేధించేవాడు. లేదంటే కాల్స్ బయటపెడతానని బెదిరించేవాడు.

అయితే గత బుధవారం అర్ధరాత్రి ఫోన్ చేసి ఇంటికి రావాలని ఇక్బాల్ ఒత్తిడి చేశాడు. దీంతో అతడితో విసిగిపోయిన మహిళ అతడ్ని చంపాలి లేదా తాను చావాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి అతడి ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటూ ఇక్బాల్ చేతులు గట్టిగా పట్టుకుని అతడి మీద కుర్చుంది. ఓ చేతితో అతని నోరు మూసి మరో చేత్తో అతడి గొంతు కోసింది.
ఇక్బాల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని మెట్ల వద్ద పడేసి వెళ్లిపోయింది. పోలీసుల విచారణలో తాను ఇలా చేయక తప్పడం లేదని.. తన కుటుంబం పిల్లలను కాపాడుకోవడానికే ఇలా చేశానని చెప్పిట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications