సీఎం 'సీటు చినిగిపోతుందని భయం, ఆయనకు అన్ని తెలివితేటలు ఉన్నాయి. మోదీ గురించి తెలిసి !

లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎక్కువ ఓట్లు రాకుంటే తన సీఎం సీటు పోతుందన్న ఆందోళనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హావేరీ గదగ్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బోమ్మయ్ వ్యంగంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టార్గెట్ అటూఇటూ అయినా కర్ణాటక సీఎం సిద్దరామయ్య సీటు గల్లంతు అవుతుందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ వ్యంగంగా అన్నారు.

శుక్రవారం గదగ్‌లో మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య మా ఉచిత హామీలే బీజేపీకి వణుకు పుట్టిస్తున్నాయన్న సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ స్పందించారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా సీఎం సిద్ధరామయ్య పునాదులు కదులుతున్నాయని, ఆయనకు వణుకుపుడుతోంది, లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు రాకపోతే ఆయన సీఎం పదవిలో కొనసాగడం కష్టమని ఆయనే స్వయంగా చెప్పారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

Basavaraj Bommay alleged that CM Siddaramaiah will lose his post after the Lok Sabha elections

మరోవైపు డీకే శివకుమార్ తాను వెంటనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. నేను సీఎం కాకపోతే పరాభవం తప్పదని డీకే శివకుమార్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పరోక్షంగా హెచ్చరించారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, వాళ్ల పని వాళ్లు చేసుసుకుంటే వాళ్లకే మంచిది అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

ప్రజ్వల్ రేవణ్ణను సెక్స్ స్కాండల్ కేసు నుంచి తప్పించడానికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు. ప్రజ్వల్ కేసులో ఇబ్బంది పడకుండా ఉండేందుకు మోదీ కర్ణాటక పర్యటనను రద్దు చేసుకున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ విరుచుకుపడ్డారు.

Basavaraj Bommay alleged that CM Siddaramaiah will lose his post after the Lok Sabha elections

ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణల కేసు బయటకు వచ్చిన తర్వాత మోదీ రెండు రోజులు కర్ణాటకలో పర్యటించి వెళ్లారని, రాహుల్ గాంధీకి ఉన్న ఆలోచనా శక్తి అంతంతమాత్రమే అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే అర్థం అవుతోందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. రాహుల్ గాంధీ తెలివితేటల గురించి తాము ఏమీ చెప్పలేమని, ఆ విషయం కాంగ్రెస్ నాయకులే చెప్పాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ వ్యంగంగా అన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+