వారణాసిలో మోడీ ర్యాలీకి భారీగా జనం: కాంగ్రెస్, ఎస్పీలపై ప్రధాని ఫైర్
వారణాసి: సర్జికల్ దాడులపై రాజకీయాలా? అంటూ ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ భద్రత కోసం తీసుకునే అలాంటి నిర్ణయాలను ఎందుకు? ఎలా ప్రశ్నించగలుగుతున్నారని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్ర మోడీ వారణాసిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
జాతీయ భద్రతాపరమైన అంశాలను ఎందుకు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్నారో వారు జాన్‌పూర్ వెళ్లి అమర జవానుల కుటుంబాలను అడగాలని, అప్పుడు ఎందుకు సర్జికల్ దాడులు చేయాల్సి వస్తుందో తెలుస్తుందని చెప్పారు.
Unforgettable moments in Kashi. It is always special being here. My gratitude to the people for the affection. Truly humbled. pic.twitter.com/Ehpn4Dl5AI
— Narendra Modi (@narendramodi) March 4, 2017
సమాజ్ వాది పార్టీ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందోనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపైనా మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము చేసిన హామీలను మర్చిబోమని, ఉత్తరప్రదేశ్ లో అధికారం వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే సన్నకారు రైతులకు రుణాలనిచ్చే విధానం సరళీకృతం చేస్తామని స్పష్టం చేశారు.
వారణాసి ఆలయంలో ప్రధాని పూజలు
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కాశీ విశ్వనాథ్, కాలభైరవ ఆలయాలను సందర్శించారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో విశ్వేశ్వరుడికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్ షోకు విశేష స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో జనం వచ్చారు.












Click it and Unblock the Notifications