బంగాళాఖాతంలో బలపడ్డ ఆవర్తనం

Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. దీని ప్రభావం మూడు రాష్ట్రాలపై పడే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనావేసింది.

ఆగ్నేయదిశగా బంగాళాఖాతం ఉపరితలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తున వ్యాపించివుంది. ఇది మరింత బలపడింది. సముద్రం మీదుగా వీస్తోన్న బలమైన ఈస్టర్లీ విండ్స్ దీనికి తోడయ్యాయి. ఫలితంగా ఆవర్తనం మరింత విస్తరిస్తుందని ఐఎండీ చెబుతోంది.

Bay of Bengal Bengaluru is expected to receive its 1st rainfall of the year on January 13 and 14

ఈ ఈస్టర్లీ విండ్స్ వేగం గంటకు 35 నుండి 45 కిలో మీటర్ల వరకు ఉండొచ్చు. గంటకు 55 కిలో మీటర్ల వరకకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, బంగాళాఖాతంలో నైరుతి- దక్షిణ ప్రాంతాల్లో బలమైన తూర్పు ఈదురు గాలులు వీస్తాయి.

దీని ప్రభావంతో- కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని బెంగళూరులోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎన్ పువియరాసన్ తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో బెంగళూరులో ఓ మోస్తరు వర్షపాతం నమోదువుతుందని అన్నారు. దక్షిణ కర్ణాటక, తీర ప్రాంత జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడొచ్చని చెప్పారు.

అదే సమయంలో ఉష్ణోగ్రత మరింత పడిపోతుందని పువియరాసన్ చెప్పారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 10 నుంచి 11 డిగ్రీల వరకు నమోదవుతుందని చెప్పారు. చలి తీవ్రత, ఈదురుగాలుల ప్రభావం పెరుగుతుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

కేరళలో 10 జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తిరువనంతపురం, కొల్లం, పథనంథిట్ట, అళప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మళప్పురం, వాయనాడ్ జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. శుక్రవారం సాయంత్రం తిరువనంతపురం, కొల్లం, ఇడుక్కి, ఎర్నాకుళం, పథనంథిట్ట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి.

అటు తమిళనాడు వ్యాప్తంగా వచ్చే 72 గంటల పాటు అంటే- 12వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పుదుచ్చేరి, కరైకల్‌ల్లోనూ ఇదే తీవ్రత కనిపించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. అదే సమయంలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+