బంగాళాఖాతంలో ఆవర్తనం- ఉరుములు, మెరుపులతో.. రాత్రంతా

Bay of Bengal: ఏపీలో ఎండలు మండిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగునే ఉన్న తమిళనాడుకు మాత్రం వరుణుడు కరుణించాడు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయక్కడ. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురుస్తోన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావమే ఈ వర్షాలకు కారణమైంది.

రాత్రి కుండపోతగా..

నేడు, రేపు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అంచనాలకు అనుగుణంగా దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో శనివారం రాత్రి కుండపోతగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో రాత్రంతా దంచి కొట్టాయి.

Bay of Bengal Heavy rains have lashed parts of several districts in Tamil Nadu including Rameswaram

అత్యధిక వర్షపాతం..

రామేశ్వరం, తూత్తుకుడిల్లో వర్షాల తీవ్రత అధికంగా కనిపించింది. ఈ రెండు చోట్లా అత్యధిక వర్షపాతం నమోదైంది. వీటి ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. జనం అంధకారంలో గడిపారు.

10 జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్ట్..

భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో దక్షిణ ప్రాంతంలో 10 జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్ కాశి, తూత్తుకూడి, విరుధునగర్, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగ, తంజావూరు, మధురై జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.

మరో 24 గంటలు..

ఇప్పుడు తాజాగా మరో ఎనిమిది జిల్లాలను ఈ జాబితాలోకి చేర్చింది రీజినల్ ఐఎండీ. చెన్నై, తిరుచ్చి, ఈరోడ్, సేలం, తిరువారూర్, నాగపట్నం, మైలాడుథురై, థేని, దిండిగల్, కోయంబత్తూరు.. వంటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పుదుచ్చేరి, కారైకల్ సహా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వీటి తీవ్రత సోమవారం వరకూ ఉంటుంది.

తగ్గిన ఉష్ణోగ్రత..

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గినట్టే కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుదల నమోదైంది. తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలు, పుదుచ్చేరి, కారైకల్‌లల్లో 28 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత రికార్డయింది. వర్ష ప్రభావం లేని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+