ఖేల్ ఖతమ్: బౌలర్ శ్రీశాంత్‌పై జీవిత కాలం నిషేధం
న్యూఢిల్లీ: ఐపియల్ 6 ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై జీవిత కాలం నిషేధం విధించింది. అంకిత్ చవాన్లపై బిసిసిఐ జీవిత కాలం నిషేధం విధించింది. శుక్రవారం బిసిసిఐ క్రమశిక్షణా సంఘం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారు ఇక క్రికెట్ ఆడే అవకాశాలు లేనట్లే. కాగా, బిసిసిఐ విడుదల చేసిన ప్రకటనలో అజిత్ చండిల ప్రస్తావన లేదు. చండిల విషయంపై తదుపరి దశలో చర్యలు తీసుకోనున్నట్లు బిసిసిఐ వర్గాలు చెప్పాయి.
కాగా, సిద్ధార్థ త్రివేదిపై ఏడాది పాటు, అమిత్ సింగ్‌పై ఐదేళ్లు నిషేధం విధించినట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. సాక్ష్యాలు లేకపోవడంతో హర్మీత్ సింగ్‌పై కేసును మూసేశారు. ఐపియల్ ఆరో ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) తేల్చింది. తిరిగి జాతీయ జట్టులోకి వస్తానని ఆశపడిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఆశలు దీంతోనే గల్లంతయ్యాయి.

శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్, అమిత్ సింగ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు బిసిసిఐ వేసిన రవి సవానీ నేతృత్వంలోని కమిటీ తేల్చింది. దోషులకు ఐదేళ్ల నుంచి జీవిత కాలం నిషేధం విధించాలని కమిటీ సూచించింది. శ్రీశాంత్ ఉద్దేశ్యమేమిటో తనకు తెలియదని క్రమశిక్షణా సంఘం ముందు హాజరైన క్రికెటర్ హర్మీత్ సింగ్ అన్నాడు.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లకు గతంలో బెయిల్ రాగా, అజిత్ చండిలకు ఇటీవలే బెయిల్ లభించింది. వారు ముగ్గురు కూడా బెయిల్‌పై బయటే ఉన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications