బీసీసీఐ కీలక నిర్ణయం: సెలక్షన్ కమిటీపై వేటు, కొత్త కమిటీ కోసం ప్రకటన
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లో చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ చేతిలో చిత్తు కాగా.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆటతీరు, ఫిల్డింగ్ వైఫల్యం, బౌలింగ్ ఫెయిల్యూర్.. తదితర అంశాలపై జోరుగా చర్చ జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఓటమి తర్వాత జట్టులో కీలక మార్పులు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీ డెసిషన్ తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీ మొత్తంపై వేటు వేసింది. వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావలెను అంటూ బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్దేశించింది. కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు అర్హులు అని వివరించింది. ఆట నుంచి ఐదేళ్ల కిందటే రిటైరై ఉండాలని పేర్కొంది. ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని తెలిపింది. నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ కోరింది.
టీ 20 వరల్డ్ కప్‌పై యావత్ భారతం ఆశలు పెట్టుకుంది. కప్‌ను ముద్దాడుతుందని భావించారు. కానీ అలా జరగలేదు.. సెమీస్‌లోనే, అదీ కూడా ఇంగ్లాండ్‌పై దారుణ ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జయభేరీ మోగించింది. ఆ తర్వాత పాకిస్థాన్ కూడా ఫైనల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ కప్పు గెలుచుకుంది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications