రామ నామ జపంలో భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా?: మీ పేరు మీద సర్టిఫికెట్ కూడా: లింక్ ఇదే
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.
ఈ కార్యక్రమాన్ని మహోత్కష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోట్లాదిమంది రామనామ జపంతో తరిస్తోన్నారు. అయోధ్య సహా దేశంలోని అన్ని ఆలయాలు.. రామ నామ సంకీర్తనలతో మారుమోగిపోతున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా భక్తులు రామ భజనల్లో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా డైలీహంట్ (Dailyhunt) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అనుబంధ సంస్థ జోష్ (Josh) ప్రత్యేకంగా ఛాంట్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఛాంట్ రూమ్ లింక్ https://share.myjosh.in/webview/ram-mandir-event. దీన్ని క్లిక్ చేసి ఛాంట్ రూమ్‌లోకి ఎంటర్ కావొచ్చు.
తొలుత యూజర్లు తమ పేరును అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. Start Now అనే ఐకాన్‌ను క్లిక్ చేసిన వెంటనే ఛాంట్ రూమ్‌లో ప్రవేశిస్తారు. 11, 108, 1008 అనే అంకెల్లో ఏదైైనా ఒక దాన్ని ఎంచుకోవాలి. స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే శ్రీరామ్ జై రామ్ జైజై రామ్ అనే మంత్రోచ్ఛారణ ఆరంభమౌతంది. పూర్తయిన వెంటనే యూజర్ల పేరు మీద సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications