వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో .. ఎలుగుబంటినే పరుగెత్తించారుగా (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎలుగుబంటినే పరుగెత్తించిన ప్రజలు (వీడియో)

బుల్దానా : ఎలుగుబంటిని చూస్తే భయపడతాం. అదీ వస్తుంటే చంగొ బిల్ల అంటూ పరుగెడతాం. కానీ వారంతా ఒక్కటయ్యారు. అందరూ ఏకమయ్యారు. ఇంకేముందు మనం బెదిరే గుడ్డెలుగును కూడా భయపెట్టించారు. ఆ ఊరిలో ఉన్న వారంతా ఏకమయ్యారనుకున్న ఎలుగుబంటి పరుగుతీసింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మహారాష్ట్రలోని బుల్దానా మండల పరిధిలోని గిర్ద గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. ఊరికి అటవీ దగ్గరలోనే ఉంది. దీంతోపాటు గ్రామంలో చెట్లు, చెమలు ఎక్కువే. ఇంకేముంది సమీపంలోని అడవీ నుంచి ఒక ఎలుగుబంటి వచ్చింది. అయితే ఎప్పటిలాగే ప్రజలు జంకుతారని భావించింది. కానీ గ్రిడ గ్రామంలో ప్రజలంతా ఒక్కటయ్యారు. ఆ గుడ్డెలుగును తరిమేసేందుకు చేయి చేయి కలిపారు. దానిని తరిమేసేవరకు నిద్ర కూడా పోమని భీష్మించుకొని కూర్చొన్నారు. ఇంకేముంది తన ఆటలు ఈ ఊరిలో సాగవని ఎలుగుబంటి భావించింది. ఇక్కడినుంచి ఎలాగైనా తప్పించుకోవాలని భావించింది. పారిపోయేందుకు సమయం కోసం వేచి చూసింది. అక్కడే అందరూ ఉండటంతో చెట్ల పొదల్లో ఉండి .. వెళ్లిపోయేందుకు చూసింది.

bear scared to people

అయితే ఎంతకీ జనం వెళ్లకోపవడంతో ఎలుగుబంటి విసిగిపోయింది. ఎలాగైనా సరే తప్పించుకోవాలని అనుకొంది. వెంటనే వాయువేగంతో పరుగుతీసింది. బయటకు వచ్చిందో లేదో ... జనం వెంటపడ్డారు. ఇంకేముంది పరుగు తీసింది. వెంటనే బతుకుజీవుడా అంటూ ఉరికింది. అయినా ప్రజలు దానిని బెదిరించడంతో స్పీడ్‌గా పరుగెత్తి వెళ్లిపోయింది. ప్రజలు ఆగడంతో అడవీలోకి వెళ్లిపోయింది. హమ్మయ్య అంటూ ఊపిరి తీల్చుకుంది.

English summary
A strange incident took place in the village of Grida in the Buldana Zone of Maharashtra. There are many trees and sweats in the village. A bear came from a nearby forest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X