Viral Video: రైల్వే ట్రాక్‌పై హాయిగా షికారు చేసిన ఎలుగుబంటి
ఇటీవల కాలంలో ఆహారం , నీటి కోసం అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రోజూ వీటికి సంబంధించిన వీడియోలు, వార్తలు చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా చలికాలంలో టూర్ లకు వెళ్లే వారికి అప్పుడప్పుడు వన్య ప్రాణులు అతి సమీపంగా వచ్చి హాయ్ కూడా చెప్పి వెళ్తున్నాయి. అవి సైలెంట్ గా ఉన్నంత వరకు అంతా బాగానే అనిపిస్తుంది.. వన్య ప్రాణాలు కొంచం ఆక్రోశానికి గురైన వాడి దాడి బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు చలికాలం. మూగ జీవాలకు వేట కష్టంగా మారే సమయం. ఇలాంటి సమయంలో జనాల మధ్యకు ఆహారం కోసం వన్యప్రాణులు అడవి నుంచి బయటకు వస్తుంటాయి
పర్వతాల రాణిగా పిలవబడే నీలగిరి జిల్లాలో సుమారు 55 శాతం అటవీ ప్రాంతమే ఉంటుంది. ఈ దట్టమైన అడవులు ఏనుగులు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఇంకా అడవి దున్నలకు నిలయం. అయితే తాజాగా బుధవారం ఉదయం ఊటీ సమీపంలోని లవ్‌డేల్ ప్రాంతంలో ఒక ఎలుగుబంటి టాయ్ ట్రైన్ పట్టాలపై చాలా హాయిగా నడుస్తూ వెళ్తున్న దృశ్యం కనిపించింది. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఈ అరుదైన దృశ్యాన్ని తన సెల్ ఫోన్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రజల ఆందోళన.
ఊటీ మరియు దాని చుట్టుపక్కల నివాస ప్రాంతాలలో ఎలుగుబంట్ల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల కదలికలను అటవీ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. జనావాసాల్లోకి వస్తున్న ఎలుగుబంట్లను పట్టుకుని, తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఎలుగుబంటి ఎదురుపడినప్పుడు తీసుకాల్సిన జాగ్రత్తలు
ఎలుగు బంటి చాలా వేగంగా పరుగెడుతుంది.. కాబట్టి మీరు పరుగెత్తితే అది వెంటాడే అవకాశం చాలా ఎక్కువ. భయంతో కేకలు వేయకండి అలా చేస్తే అది భయపడి దాడి చేసే అవకాశం చాలా ఎక్కువ. చేతులు ఊపడం, రాళ్లు విసరడం చేయకండి. ఎలుగు బంటి సాధారణంగా మనుషులను దూరంగా ఉండే జంతువే కానీ భయపడితే లేదా ఆకస్మికంగా ఎదురైతే దాడి చేసే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications