క్యాంటిన్ లో బీఫ్ బ్యాన్ చేసిన మేనేజర్.. ఉద్యోగులు ఏం చేశారో తెలిస్తే షాక్..!
కేరళ కొచ్చిలోని కెనరా బ్యాంకు మేనేజర్ ఓ వింత కండిషన్ పెట్టారు. బ్యాంకు క్యాంటిన్ లో బీఫ్ ను బ్యాన్ చేశారు. క్యాంటిన్ లో ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ కూడా బీఫ్ తినొద్దని ఆదేశాలు జారీ చేశారు. క్యాంటిన్ లో బీఫ్ వడ్డించొద్దు అంటూ కొత్త రీజినల్ మేనేజర్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే బ్యాంకు మేనేజర్ నిర్ణయాన్ని ఉద్యోగులు, సిబ్బంది వ్యతిరేకించారు. ఈ మేరకు బ్యాంకు ఆఫీస్ ఎదుట, క్యాంటిన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బ్యాంకు మేనేజర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
కేరళలోని కొచ్చిలో బీఫ్ వివాదం రాజుకుంది. కొచ్చిలోని కెనరా బ్యాంకులో ఈ వివాదం చెలరేగింది. బ్యాంక్ కొత్త రీజినల్ మేనేజర్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆఫీస్ లోగానీ, క్యాంటిన్ లో గానీ బీఫ్ తినొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, సిబ్బంది ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండాలన్నారు. అయితే బ్యాంక్ మేనేజర్ ఆదేశాలపై సిబ్బంది, ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ బిహార్ నుంచి ఇక్కడకు బదలీ అయ్యారని ఉద్యోగులు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ తమకు మానసికంగా వేధిస్తున్నారని.. తమ మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బ్యాంకు ఎదుటే బీఫ్, పరోటా తయారు చేసి భుజిస్తూ నిరసన తెలిపారు.
" ఇక్కడ బ్యాంకులో ఓ చిన్న క్యాంటిన్ ఉంటుంది. అప్పుడప్పుడు అందులో బీఫ్ వడ్డిస్తారు. కొత్తగా వచ్చిన మేనేజర్ బీఫ్ వడ్డించొద్దని ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగబద్ధంగా బ్యాంకు క్యాంటిన్ రూల్స్ ఉండాలి. ఆహారం అనేది వ్యక్తిగత అంశం. భారత్ లో ప్రతి పౌరుడికి ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. మేము ఎవర్నీ బీఫ్ తినమని బలవంతం చేయడంలేదు. మేము ఈ విధంగా నిరసన తెలుపుతున్నాం" అని బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకుడు ఎస్ఎస్ అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నిరసనకు స్థానిక రాజకీయ నేతలనుంచి కూడా మద్దతు లభించింది. స్థానిక ఎమ్మెల్యే కేటీ జలీల్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు పలికారు. కేరళలో ఎలాంటి సంఘ్ పరివార్ ఎజెండాలను అనుమతించబోమని హెచ్చరించారు. ఏం తినాలో, ఏం ధరించాలో పై అధికారులు నిర్ణయించకూడదన్నారు. ఈ నేల ఎర్రనిది.. ఎర్రజెండా ఎగిరే చోట ఫాసిస్టులకు వ్యతిరేకంగా నిర్భయంగా మాట్లాడవచ్చని ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. గతంలోనూ 2017లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా కేరళలో బీఫ్ నిరసనలు జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications