యాచకురాలే... సినిమా సింగర్..! రైల్వే ప్లాట్ ఫాం టాలెంట్ గుర్తించిన శంకర్ మహదేవన్ (వీడియో)
కోల్‌కతా/ముంబై : ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో తెలియదు. ఎవరీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయలేం. సినిమాలు, రాజకీయాల్లో వాడే బండ్లు ఓడలు, ఓడలు బండ్లు సామెత .. సాధారణ ప్రజలకు కూడా వర్తిస్తోంది. ప్రతిభ ఉండాలే గానీ ప్రోత్సహించే వారికి కొదవలేదు. మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా గాయకులకు ఇదీ వందశాతం వర్తిస్తోంది. మంచి స్వరం, టైమింగ్‌తో పాటలు పాడితే చాలు .. అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. బెంగాల్‌కు చెందిన ఓ యాచకురాలి జీవితంలో ఇలాంటి ఘటనే జరిగింది.

ప్లాట్ ఫాం నుంచి స్టూడియోలోకి ..
పక్క ఫోటోలో కనిపిస్తోన్నది ఒక్కరే. అవును మీరు వింటున్నది నిజమే. అందులో కనిపిస్తోన్న మహిళ నేపథ్య గాయనీకి ముందు నేపథ్య గాయనీ తర్వాత ఫోటోలు. విషయానికొస్తే .. పశ్చిమబెంగాల్‌లోని రాణఘాట్ రైల్వే ఫ్లాట్‌ఫాంలో ఓ యాచకురాలు పాటలు పడుతుంది. అచ్చం నేపథ్య గాయనీ మాదిరిలా పాటలు పడటంతో అటుగా వెళ్లేవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె గొంతునుంచి వస్తోన్న మధురగానం విని అందరూ పులకించిపోయారు. కానీ ఒకరు ఆమె ప్రతిభను వెలికితీయాలని భావించారు. ఆమెతో పాటలు పాడించి వీడియో తీశారు. రెండు అర పాటలు వీడియో తీసి .. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది నెటిజన్లు ఆమె ప్రతిభపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ వీడియో అలా అలా సినీ ప్రముఖుల వద్దకు కూడా చేరింది.
ఆశ్చర్యపోయిన శంకర్ మహదేవన్
ఆమె పాడిన పాటను విని ప్రముఖ నేపథ్య గాయకుడు శంకర్ మహదేవన్ ఆశ్చర్యపోయారు. ఓ మధుర గానం రైల్వే ప్లాట్ ఫాం ఉంటుందా అని చలించిపోయారు. ఆ వీడియో ఆధారంగా ఆమె ఆచూకీ కనుగొన్నారు. ఆమెను పిలిచి మాట్లాడారు. బాలీవుడ్‌లో పాటలు పాడే అవకాశం కల్పించారు. దీంతో యాచకురాలు కాస్త గాయనిగా మారిపోయారు. నేపథ్య గాయనీ అంటే మాములు విషయం కాదు కదా .. అందుకే ఆమె ఇలా మోడ్రన్‌గా మారిపోయారు. అంతేందుకు రాణఘాట్ ఫ్లాట్ ఫాం మీద చూసినవారే ఆమెను చూసి నమ్మలేకపోతున్నారు. అవునా నిజంగా .. ఇలా మారిపోయారా అంటూ ఆశ్చర్యపడుతున్నారు. మరికొందరు ఆమె ప్రతిభకు తగిన ప్రోత్సాహం లభించిందని అంటున్నారు.

మరవను మీ మేలు
తనకు లభించిన అవకాశంపై యాచకురాలు ఉబ్బితబ్బవుతున్నారు. అంతేకాదు తాను కూడా నమ్మలేకపోతున్నానని చెప్తున్నారు. ఎక్కడో ఉన్న తనను పిలిచి అవకాశం ఇచ్చిన శంకర్ మహాదేవన్ దేవుడంటూ ప్రశంసిస్తున్నారు. తన జీవితం మారేందుకు శంకర్ సారే కారణమని తెలిపారు. దీంతోపాటు వీడియో తీసి పోస్ట్ చేసిన యువకుడు .. వాటిని షేర్ చేసిన వారికి కూడా రుణపడి ఉంటానన్నారు. వారందరి సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని పేర్కొన్నారు. తన జీవితం కొత్త పుంతలు తొక్కడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యావాదాలు తెలిపారు.
-
ఈ చెట్లు మధ్యలో దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications