కుదిపేస్తున్న సెక్స్ వీడియో : అందులో నేను లేనంటోన్న మంత్రి

న్యూఢిల్లీ : పార్టీ క్రమశిక్షణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తోన్న ఆమ్ ఆద్మీ.. మహిళలతో రాసలీలలు కొనసాగిస్తూ సీడీల ద్వారా బుక్కయిపోయిన మంత్రి సందీప్ కుమార్ ను కేబినెట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సందీప్ కుమార్ వాదన మాత్రం మరోలా ఉంది.

కేవలం తానో దళితుడినవడం వల్లే మంత్రి వర్గం నుంచి తనకు ఉద్వాసన పలికారని ఆరోపిస్తున్నారు సందీప్ కుమార్. ఢిల్లీ సీఎంకు అందిన సెక్స్ సీడీల వీడియోల్లో తాను లేనని చెబుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే అసలు విషయాలు వెలుగుచూస్తాయని అంటున్నారు సందీప్ కుమార్.

‘Being framed because I’m Dalit,’ says Sandeep Kumar sacked over sex tape

ఇదంతా తనపై జరుగుతోన్న కుట్రగా అభివర్ణిస్తోన్న సందీప్ కుమార్.. తన ఇంటి ఎదుట అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్టించినప్పటి నుంచే తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సందీప్ కుమార్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు. దళిత కమ్యూనిటీకి నుంచి పార్టీలో తానే ప్రముఖంగా ఉండడంతో ఈ కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు సందీప్.

తన నుంచి ఎలాంటి వివరణ కోరకుండా.. మీడియా ఆ క్లిప్పింగ్స్ ను ప్రసారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు సందీప్. తన కుటుంబం తనకు అండగా నిలబడుతుందని, ఇలాంటి వివాదాలకు తాను బెదిరే రకం కాదని సందీప్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+