DCM: ముంబాయి ఎవడబ్బ సొత్తు కాదు, ఢిల్లీలో చెబుతాము జాగ్రత్త, సొంత పార్టీ మంత్రికి డీసీఎం వార్నింగ్ !
ముంబాయి/ బెంగళూరు: ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న కర్ణాటక సీనియర్ మంత్రి జే. మధుస్వామి వ్యాఖ్యలను మహారాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. ముంబాయి మహారాష్ట్రకే చెందుతుందని, అది ఎవడబ్బు సొమ్ము కాదని, వాళ్ల ఇంటి ఆస్తి కాదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే అందరికి మంచిదని పక్క రాష్ట్రంలోని సొంత పార్టీ మంత్రి మీద మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. మరోసారి బెళగావి సరిహద్దు వివాదంలో కర్ణాటక- మహారాష్ట్రలోని బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

అమిత్ షాకు చెబుతాము.. ..జాగ్రత్త
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో మహారాష్ట్ర తీరుపై కర్ణాటక మంత్రి మధుస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయమై మహారాష్ట్ర, కర్ణాటక కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తామని, ఇలాంటి నినాదాలను తిప్పికొట్టాలని కేంద్ర మంత్రి షాకు వినతి పత్రం అందజేస్తామని మదుస్వామి చెప్పారు.

బెళగావి vs ముంబాయి
బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారికి దేశంలోని రెండు మూడు నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నానని మధుస్వామి అన్నారు. బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రటించాలంటే ముందుగా ముంబాయిని కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని, అప్పుడే అక్కడి ప్రజలకు మంచి జరుగుతుందని కర్ణాటక మంత్రి మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంగులం భూమికూడా వదలం
మా భూమిలో ఒక్క అంగుళం కూడా మహారాష్ట్రకు ఇవ్వబోమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మై అన్నారు. దీనికి తోడు మంత్రులు డాక్టర్ సుధాకర్, మధుస్వామి బెళగావి విషయంలో జోరుగా మాట్లాడారు. కర్ణాటక మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర శాసనసభలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ మారాష్ట్ర మనోభావాలపై కర్ణాటక ప్రభుత్వం తీరుపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ముంబాయి జోలికి వస్తే ?
ముంబాయి మహారాష్ట్రకు చెందుతుందని, ఎవడి అబ్బసొత్తు కాదని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే వార్తా సంస్థ తెలిపింది. ముంబాయి మీద ఎవరైనా దావా వేస్తే మేము సహించమని దేవేంద్ర ఫడ్నవిస్ హెచ్చరించారు. మేము మా మనోభావాలను కాపాడుకోవాలని అనుకుంటున్నాము, మా మనోభావాల మీద కర్ణాటక ప్రభుత్వం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మేము కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి వారి మీద చర్యలు తీసుకోవాలి మనవి చేస్తామని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలిపింది.

నేను ముంబాయి కర్ణాటక లీడర్
ముంబాయి కర్ణాటకకు చెందినది ఇటీవల కర్ణాటక నాయకులు కొత్త వివాదానికి తెరలేపారని అజిత్ పవార్ కర్ణాటక మంత్రి మధుస్వామి మీద మండిపడ్డారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సవాది మాట్లాడుతూ తాను ముంబాయి కర్ణాటకకు చెందినవాడినని చెప్పి మరాఠీలను ఇంకా రెచ్చగొట్టారు. ఈ దెబ్బతో బెళగావిలో మరోసారి కన్నడిగులు, మరాఠీలు ఒకరిని చూస్తే ఒకరు రగిలిపోతున్నారని తెలిసింది.

అమిత్ షా చెప్పినా ఈ నాయకులు మాట వినలేదా ?
ఇదే నెలలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇరు రాష్ట్రాల నాయకులు ఎవ్వరూ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యకూడదని సూచించారని తెలిసింది. 865 గ్రామాల్లో మరాఠీలు ఎక్కువగా ఉన్నారని, ఆ గ్రామాల్లోని ప్రతి అంగుళం భూమిని చట్టబద్ధంగా మహారాష్ట్రలో కలిపేయాలని మహారాష్ట్ర శాసనసభలో మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బెళగావి, బెల్గాం, కారవారా, నిప్పాణి, బీదర్, భాల్కీ మహారాష్ట్రలో కలిపేయాలని మహారాష్ట్ర శాసనభలో ఏకగ్రీవంగా ఆమోదించడంతో మరోసారి రెండు రాష్ట్రాల మద్య సరిహద్దు వివాదం ముదిరిపోయింది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications