కలకలం: పోర్న్ చిత్రాలను వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన ఎమ్మెల్సీ!

Subscribe to Oneindia Telugu

బెల్గావి: బాధ్యతాయుతమైన పదవీ ఉండి సిగ్గుమాలిన పని చేశారు ఆ ప్రజాప్రతినిధి. ఏకంగా పోర్న్ చిత్రాలనే సామాజిక మాధ్యమాలలో ఒకటైన వాట్సప్ ద్వారా వివిధ గ్రూపులకు పంపించాడు. కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్సీ చేసిన ఈ సిగ్గుమాలిన పని రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బెల్లావి పట్టణానికి చెందిన ఎమ్మెల్సీ మహన్ తేష్ కవతగిమాత్(బీజేపీ).. 50 అశ్లీల చిత్రాలను బెల్గావి మీడియా ఫోర్స్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రూప్‌లో సీనియర్ రాజకీయనాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జర్నలిస్టులు ఉన్నారు.

Belagavi MLC posts porn photos to WhatsApp group

కాగా, సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడైన ప్రభాకర్ కోరే అనుచరుడైన మహన్ తేష్ కేఎల్ఈ సొసైటీ పేరిట పలు విద్యాసంస్థలు, ఆర్థికసంస్థలు నిర్వహిస్తున్నారు. మహన్ తేష్.. అశ్లీల చిత్రాలతోపాటు రాజకీయ నాయకుల నిజాయితీపై పదునైన వ్యాఖ్యలతో వాట్సాప్‌లో పెట్టిన వెంటనే.. ఈ విషయం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైంది.

దీంతో తమ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ పెట్టిన అశ్లీల చిత్రాలను వెంటనే తొలగించామని గ్రూప్ నిర్వాహకుడు మహబూబ్ మకందర్ చెప్పారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ ఇలాంటి అశ్లీల చిత్రాలు ఎలా పోస్టు చేశాడని, దీనిలో ఎదో జరిగి ఉంటుందని వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడు మకందర్ అంటున్నారు. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు.

కాగా, వాట్సప్ వ్యవహారం అనంతరం ఆ ఎమ్మెల్సీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు సమాచారం. మీడియా ఛానళ్లలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది. కాగా, ఎమ్మెల్సీ అశ్లీల చిత్రాల పోస్టింగ్ వ్యవహారం కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The pornographic pictures posted to a WhatsApp group by Belagavi MLC Mahantesh Kavatagimath (BJP) on Tuesday evening were much discussed across the district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి