చిన్నమ్మపై అత్యాచారయత్నం: కిరాయి హంతకులతో చంపించిన చిన్నాన్న

బెంగళూరు: తన తండ్రి సొంత తమ్ముడి భార్య మీద కన్నేసిన యువకుడు కిరాయి హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో జరిగింది. బెల్గాం జిల్లాలోని బెళవాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న మహంతేష్ నావలగి (19) అనే యువకుడు హత్యకు గురైనాడు. మహంతేష్ ను హత్య చేసిన కేసులో అతని చిన్నానతో పాటు బెంగళూరుకు చెందిన నలుగురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్టు చేశారు.

మహంతేష్ తండ్రి.. సొంత తమ్ముడు రాయప్ప. రాయప్ప భార్య (43)పైన మహంతేష్ కన్ను పడింది. రాయప్ప లేని సమయంలో మహంతేష్ చిన్నాన ఇంటికి వెళ్లేవాడు. వరసకు చిన్నమ్మ అయిన రాయప్ప భార్యతో ఇంటి పనులకు సహకరిస్తున్నట్లు నటిస్తూ చనువుగా ఉండేవాడు.

ఎవరు లేని సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్థించేవాడు. అయితే, దానిని ఆమె కొడుకు అనే చనువుగా భావించింది. ఆమెకు ఏమాత్రం అనుమానం రాలేదు. మరోసారి ఆమెతో మహంతేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. అదే సమయంలో రాయప్ప ఇంటికి వచ్చి విషయం గుర్తించాడు. మహంతేష్ కు వార్నింగ్ ఇచ్చాడు.

belgaum aunty harassment ... mahantesh murder

గత నెల రాయప్ప లేని సమయంలో వారి ఇంటికి వెళ్లిన మహంతేష్ చిన్నమ్మ మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న రాయప్ప ఎలాగైన అన్న కుమారుడిని అంతం చెయ్యాలని భావించాడు. వెంటనే బెంగళూరుకు చెందిన నలుగురు కిరాయి హంతకులను సంప్రదించాడు.

మహంతేష్ ను అంతం చెయ్యడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత వారం కిరాయి హంతకులు నలుగురు బెల్గాం చేరుకున్నారు. రాయప్ప అన్న కుమారుడు మహంతేష్ కు మాయమాటలు చెప్పి బెళవాడిలో జరుగుతున్న జాతరకు పిలుచుకుని వెళ్లారు.

అనంతరం రాయప్ప, మహంతేష్, నలుగురు కిరాయి హంతకులు కలిసి మిలటరి హోటల్ లో మద్యం సేవించి మాంసాహారం తిన్నారు. మద్యం మత్తులో ఉన్న మహంతేష్ ను పిలుచుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో అతని తల మీద బండరాళ్లు వేసి నుజ్జునుజ్జు చేసి హత్య చేశారు.

హంతకులను రాయప్ప స్వయంగా హుబ్బళి రైల్వే స్టేషన్ పిలుచుకుని వెళ్లి బెంగళూరు పంపించాడు. కేసు నమోదు చేసిన దోడ్డవాడి పోలీసులు విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసింది. సోమవారం నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+