ఖాకీ రొమాన్స్: ఓ ఎస్సై..ఓ కానిస్టేబుల్, కానిస్టేబుల్ భార్య... ఇదీ స్టోరీ!
బళ్లారి: పోలీసు శాఖలో అక్రమ సంబంధాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇటీవల బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీగా పని చేసిన ఐపీఎస్ అధికారి ఓ టెక్కీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వెలుగు చూసిన మూడు రోజులకే మరో భాగోతం వెలుగు చూసింది. బళ్లారి నగరంలో ఎస్ఐగా పని చేస్తున్న వ్యక్తి కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వెలుగు చూసింది. ఎస్ఐ, పోలీసు భార్య గొడవ నడిరోడ్డులోకి రావడం, నానా హంగామా చెయ్యడంతో చివరికి ఇద్దరూ జైలుకు వెళ్లారు.

ఎస్ఐ ఉద్యోగం
బళ్లారి నగరం వైర్ లెస్ విభాగంలో కిరణ్ సామ్రాట్ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ డీఏఆర్ క్వాటర్స్ లో నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి భార్య, పాపతో కలిసి నివాసం ఉంటున్నాడు.

పెళ్లికి ముందే సంబంధం
కానిస్టేబుల్, మహిళకు ఐదు ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక పాప ఉంది. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ కు మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక పాప ఉంది. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ కు పెళ్లికి ముందే కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం ఉందని సమాచారం.

పెళ్లాం ఊరెళితే !
ఎస్ఐ కిరణ్ సామ్రాట్ భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ భార్య ఎస్ఐ కిరణ్ సామ్రాట్ ఇంటికి వెళ్లింది. ఆ సందర్బంలో ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. కొంత కాలంగా ఎస్ఐ, కానిస్టేబుల్ భార్య మద్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం.

ఎస్ఐ ఇంటికి నిప్పు
ఎస్ఐ కిరణ్ సామ్రాట్, కానిస్టేబుల్ భార్య మద్య గొడవ తారాస్థాయికి చేరడంతో ఇంటికి నిప్పంటించారు. ఇంటిలోని సోఫా, పర్నీచర్, దుస్తులు బూడిద అయ్యాయి. క్వాటర్స్ లోని ఇంటి కిటికీ అద్దాలు ద్వంసం అయ్యాయి. క్వాటర్స్ లో నివాసం ఉంటున్న వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు.

పోలీసు భార్య వీరంగం
సంఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది, గాంధీబజార్ పోలీసులతో కానిస్టేబుల్ భార్య గొడవ పెట్టుకుంది. నా ఇష్టం వచ్చిన వారితో తిరుగుతాను, ప్రశ్నించడానికి మీరెవరు అంటూ వాగ్వివాదానికి దిగింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ ఆమె క్వాటర్స్ రోడ్డులో నానా హంగామా చేసింది.

మద్యం మత్తు దిగలేదు
గొడవ జరిగిన సమయంలో ఎస్ఐ, కానిస్టేబుల్ భార్య మద్యం సేవించారని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని కేసు నమోదు చేసిన అధికారులు ఎస్ఐ, కానిస్టేబుల్ భార్యను అరెస్టు చేసి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ ను సస్పెండ్ చేసి డీఎస్పీతో విచారణ చేయిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications