రెబల్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి యూటర్న్: రాజీనామా వెనక్కి ?, సీఎంకు మద్దతుగా ఓటు !

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చివరి వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి రామలింగా రెడ్డితో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించాయి.

సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి ఆయన రాజీనామా లేఖను వెనక్కి తీసుకుంటారా ? అనే అనుమానం కలుగుతోంది. రేపు తాను విధాన సౌధలో జరిగే శాసన సభ సమావేశాలకు హాజరౌతానని రామలింగా రెడ్డి అన్నారు.

Bemgaluru BTM Layout rebel Congress MLA Ramalinga Reddy may withdraw the resignation.

బుధవారం బెంగళూరులో రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అదే పార్టీలోనే ఉంటానని రామలింగా రెడ్డి చెప్పారు. గురువారం తాను కచ్చితంగా శాసన సభ సమావేశాల్లో పాల్గొంటానని, అందులో ఎలాంటి అనుమానం లేదని రామలింగా రెడ్డి స్పష్టం చేశారు.

తాను ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని, అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద కాని, సంకీర్ణ ప్రభుత్వం మీద కాని తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని రెబల్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. తాను కొన్ని కారణాల వలన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రామలింగా రెడ్డి అన్నారు.

తన అభిప్రాయం తెలుసుకోవడానికి గురువారం రావాలని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారని, స్పీకర్ తో తన రాజీనామా విషయం చర్చిస్తానని రెబల్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి చెప్పారు. గురువారం సీఎం కుమారస్వామికి మద్దతు ఇస్తూ రామలింగా రెడ్డి ఓటు వేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+