రెచ్చిపోయిన ఖాకీ.. బెంగాల్ ఎంపీ ఇంటి వద్ద రిపోర్టర్ చెంపచెళ్లుమనిపించిన పోలీసు ..

కోల్‌కతా : ఖాకీలు రెచ్చిపోతున్నారు. మీడియా ప్రతినిధులపై ఏకంగా దాడులకు దిగుతున్నారు. ఇటీవల బెంగాల్‌లో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో కవరేజీకి వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. రిపోర్టర్ చెంప చెళ్లుమనిపించారు బెంగాల్ డీసీపీ. ఈ దాడిని మీడియా ప్రతినిధులు, సంఘాలు తప్పుపట్టాయి.

ఇటీవల ఉత్తర 24 పరగణ జిల్లాలో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఆందోళన చేపట్టారు. అర్జున్ సింగ్ టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. ఆయన ఎంపీ కూడా.. ప్రభుత్వ వైఖరిని నిరిస్తూ ఆందోళనకు దిగారు. ఆయన ఆందోళన చేస్తుండగా ఒక్కసారిగా దాడి జరిగింది. దీంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎంపీ దాడితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఆందోళన, దాడి ఘటనను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు. అయితే పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీఛార్జీ కూడా చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు కూడా.

Bengal DCP slapped journalist during clashes at MP Arjun Singh residence

దాడి తర్వాత అర్జున్ సింగ్ నివాసం బాత్పూరలో గల మజ్దూర్ భవన్‌కు మీడియా ప్రతినిధులు తరలివచ్చారు. అసలే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఓ అజయ్ ఠాకూర్ అనే మీడియా ప్రతినిధి ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన డీసీపీ మీడియా ప్రతినిధి చెంప చెళ్లుమనిపించారు. తర్వాత ఇతరులు కూడా ఠాకూర్‌పై దాడి చేశారు. ఈ విషయాన్ని అక్కడున్న మీడియా ప్రతినిధులే చెప్పారు. ఓ జర్నలిస్టుపై దాడిని మీడియా సంఘాలు తప్పుపట్టాయి. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+