బెంగాల్‌లో డాక్టర్ల సమ్మె ఉద్ధృతం.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్య సేవలు..
ఢిల్లీ : బెంగాల్‌లో ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువుల దాడి ఘటనపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మెకు దిగారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం పిలుపు మేరకు వైద్యులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఢిల్లీ సహా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో విధులు బహిష్కరించిన డాక్టర్లు ఆందోళనల్లో పాలు పంచుకుంటున్నారు.

నిరసన తెలుపుతున్న డాక్టర్లు
ఢిల్లీలో పలువురు రెసిడెంట్ డాక్టర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. రోగుల బంధువుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎయిమ్స్ వైద్యులు హెల్మెట్లు, బ్యాండేజీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఓపీ సేవలను బంద్ చేసిన డాక్టర్లు ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు బెంగాల్‌లో జూనియర్ డాక్టర్‌పై దాడికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని నిర్ణయించారు.

నిమ్స్‌లో డాక్టర్ల ఆందోళన
జూనియర్ డాక్టర్‌పై దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లోనూ వైద్యులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. నిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అటు మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓపీ, వార్డుల్లో వైద్య సేవలు అందించరాదని నిర్ణయించారు. అయితే ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రం ఎలాంటి ఆటంకంలేకుండా చర్యలు తీసుకున్నారు.

బెంగాల్‌లో నాల్గో రోజుకు చేరిన సమ్మె
ఇదిలా ఉంటే బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె నాల్గో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని సీఎం మమతబెనర్జీ అల్టిమేటం ఇచ్చినా వారు బేఖాతరు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. మమత బెనర్జీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే సమ్మె విరమిస్తామని జూడాలు స్పష్టం చేశారు.

రాజకీయ కుట్ర అంటున్న దీదీ
కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న రోగి సోమవారం చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యమే అందుకు కారణమని మృతుని బంధువు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్లపై దాడి చేశారు.ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. అయితే దీని వెనుక బీజేపీ, సీపీఎంల హస్తం ఉందని దీదీ ఆరోపిస్తుండగా... ఓట్ల కోసం మమత బెనర్జీ సమ్మె విషయంలో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications