రేప్: నగ్నంగా చెట్టుకు వేలాడుతూ యువతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన ఓ బాలిక(16) తెల్లవారేసరికి నగ్నంగా ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు మృతదేహాన్ని కదలనివ్వలేదు. బాలిక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో మృత దేహాన్ని పోలీసులకు అప్పగించారు.

పదోతరగతి చదువుతున్న బాలిక మంగళవారం మధ్యాహ్నం కనిపించకుండా పోయింది. బుధవారం నాడు సితాయ్‌లోని బీడీవో కార్యాలయం వద్ద బాలిక విగతజీవిగా చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications