యువ మోడల్‌ను దారుణంగా హత్య చేసిన ఓలా క్యాబ్ డ్రైవర్: జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు
బెంగళూరు: కోల్‌కతాకు చెందిన యువ మోడల్, ఈవెంట్ మేనేజర్ పూజ సింగ్ డే(30ని దారుణంగా హత్య చేసిన ఓలా టాక్సీ డ్రైవర్ హెచ్ఎం నగేష్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు వచ్చిన పూజ.. తిరిగి కోల్‌కతా వెళుతుండగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జులై 31న హత్యకు గురైంది.

విమానాశ్రయానికి తీసుకెళ్లాలంటూ..
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు పూజ.. ఓ ఓలా క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించింది. ఆ క్యాబ్ డ్రైవర్ నగేష్‌కు ఫోన్ చేసి జులై 31న ఉదయం 4గంటలకు తనను విమానాశ్రయానికి తీసుకెళ్లాలని కోరింది. కోల్‌కతా వెళ్లేందుకు తాను బస చేసిన పరప్పన అగ్రహార హోటల్ నుంచి ఆ ఓలా క్యాబ్‌లో బయల్దేరింది.

డబ్బులు ఇవ్వలేదని దారుణం..
అయితే, నిందితుడు, క్యాబ్ డ్రైవర్ నగేష్ నేరుగా విమానాశ్రయం తీసుకెళ్లకుండా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.పూజను డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో జాక్ రాడ్‌తో పూజను తీవ్రంగా కొట్టి, ఆమె వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు ఇతర విలువైన వస్తువులు తీసుకున్నాడు. అంతేగాక, పూజ భర్తకు ఫోన్ చేసిన నిందితుడు నగేష్.. రూ. 5లక్షలు డిమాండ్ చేశాడు.

పూజ మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు
ఆ తర్వాత విమానాశ్రయం కాంపౌండ్ సమీపంలో, కియా వెనుకాల పూజ మృతదేహాన్ని వదిలేసి పరారయ్యాడు నిందితుడు నగేష్. కాగా, విమానాశ్రయంలో సమీపంలోని కడయరప్పనహళ్లి గ్రామస్తులు పూజ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూజ ధరించిన టైటాన్ వాచ్, జలస్ జీన్స్, బ్రాండెడ్ శాండల్స్ ను బట్టి పోలీసులు బాధితురాలిని గుర్తించారు.

వ్యక్తిగతంగా బుక్ చేసుకోవద్దు..
జులై 30న బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పూజ.. మళ్లీ పశ్చిమబెంగాల్ వెళుతుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై పూజ భర్త కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ప్రయాణికులు ఎవ్వరూ కూడా వ్యక్తిగతంగా క్యాబ్ బుక్ చేసుకోవద్దని.. క్యాబ్ అగ్రిగేటర్స్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!












Click it and Unblock the Notifications