Bengaluru: రాత్రికి నీ భార్యను పంపించు అని ఇంటి ఓనర్ ను అడిగాడు, 360 డిగ్రీ యాంగిల్స్ లో ?
రేయ్ ఇంటి ఓనర్, మర్యాదగా నీ భార్యను నాతో ఒక్కరోజు రాత్రికి పంపించు, అన్నీ సరిపోతాయి, లేదంటే సీన్ రివర్స్ అవుతుందని అని సినిమా డైలాగ్ లు కొట్టాడు.
బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. సొంత ఇల్లు కట్టుకుని భార్య, పిల్లలతో అతను హ్యాపీగా ఉంటున్నాడు. రాత్రి ఓ యువకుడు అతని ఇంటి మేడమీదకు వెళ్లాడు. నువ్వు మా ఇంటి మీదకు ఎందుకు వెళ్లావు అని ఇంటి యజమాని ప్రశ్నించాడు. మద్యం మత్తులో మేడ మీదకు ఎక్కిన యువకుడు ఇంటి యజమానిని అమ్మనాబూతులు తిట్టాడు. రేయ్ ఇంటి ఓనర్, మర్యాదగా నీ భార్యను నాతో ఒక్కరోజు రాత్రికి పంపించు, అన్నీ సరిపోతాయి, లేదంటే సీన్ రివర్స్ అవుతుందని అని సినిమా డైలాగ్ లు కొట్టాడు.

మద్యం మత్తులో వేరే ఇంటి మేడ మీద హంగామా
బెంగళూరులోని సిద్ధాపురలో సురేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. భార్య పిల్లలతో సొంత ఇంటిలో ఉంటున్న సురేష్ సంతోషంగా ఉంటున్నాడు. సిద్దాపుర సమీపంలో నివాసం ఉంటున్న మణికంఠ అనే వ్యక్తి రాత్రి పీకలదాక మద్యం సేవించాడు. మద్యం మత్తులో సురేష్ ఇంటిపైకి ఎక్కిన మణికంఠ నానా హంగామా చేశాడు. మణికంఠ తన ఇంటి మేడ మీదకు ఎక్కడాని తెలుసుకున్న సురేష్ అతను మేడ మీదకు వెళ్లాడు.

రాత్రికి నీ భార్యను పంపించురా
ఇంతరాత్రి పూట మా ఇంటి మీదకి ఎందుకు ఎక్కుతున్నావ్, కిందకి దిగి రా అని సురేష్ తాగుబోతు మణింకఠకు చెప్పాడు. ఎంత చెప్పినా ఇంటి మేడ మీద నుంచి కిందకు దిగకుండా అక్కడే ఉన్న మణికంఠ ఇంటి బిల్డింగ్ ఓనర్ సురేష్‌ను అనరాని పదాలతో దుర్భాషలాడుతూ బూతులు తిట్టాడు. తరువాత ముందు నువ్వు మీ ఇంట్లోకి వెళ్లి నీ భార్యను పిలుచుకుని వచ్చి నాతో పంపించురా, అప్పుడు కిందకు దిగుతాను అంటూ మణికంఠ ఇంటి యజమాని సురేష్ తో అసభ్యంగా మాట్లాడాడు.

ఇంటి ఓనర్ కు ఎక్కడో కాలిపోయింది
దీంతో కోపోద్రిక్తుడైన సురేష్ భవనం కింద పడి ఉన్న చెక్క కర్ర తీసుకెళ్లి నా భార్యను నీతో పంపించమంటావారా నా కొడకా, నీకు ఎంత ధైర్యం అంటూ మణికంఠ తల మీద కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో కిందపడిపోయిన మణికంఠ స్పృహ కోల్పోయాడు. మణికంఠ ఇంటి దగ్గరకు వెళ్లిన సురేష్ మీ కొడుకు ఫుల్ గా తాగేసి మీ ఇంటి మేడ మీదకు ఎక్కి కిందపడిపోయాడని చెప్పాడు.

తలకు మాత్రమే ఎలా దెబ్బలు తగిలాయి ?
మణికంఠ కుటుం సభ్యులు, పోలీసులు కలిసి మణికంఠను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఇంటి ఓనర్ సురేష్ సహాయం చేశాడు. అయితే అప్పటికే మణికంఠ చనిపోయాడని వైద్యులు చెప్పారు. మద్యం మత్తులో మణికంఠ మేడ మీద నుంచి కిందకుపడిపోతే అతని తలకు మాత్రమే ఎలా దెబ్బలు తగులుతాయని, శరీరం మీద ఎందుకు గాయాలు కాలేదని పోలీసులకు అనుమానం వచ్చింది. సురేష్ ను ప్రశ్నిస్తే ఏమో నాకేమి తెలుసు, అతను మేడ మీద నుంచి కిందకుపడిపోయాడు అంతే అని చెప్పాడు.

సీసీటీవీ కెమెరాల్లో ?
పోలీసులకు అనుమానం వచ్చి బిల్డింగ్ ఓనర్ సురేష్ నివాసం ఉంటున్న ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే అసలు మ్యాటర్ తెలిసింది. అయినా సురేష్ కథలు చెప్పడంతో పోలీసులకు మండిపోయి నాలుగు తగిలిస్తే సురేష్ అసలు నిజం బయటకు చెప్పాడు. నా భార్యను ఒక్కరోజు తనతో పంపించాలని మణికంఠ అసభ్యంగా మాట్లాడాడని, కొపం తట్టుకోలేక చెక్కతో దాడి చేశానని, తాను చంపాలని చంపలేదని సురేష్ నేరం అంగీకరించాడని, కేసు విచారణలో ఉందని సిద్దాపుర పోలీసులు తెలిపారు.
-
నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా.. -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications