MLA: అయ్యా బెయిల్ ఇవ్వండి, కొడుకు చేసిన పనికి పదవి, పరువు మొత్తం పోయే, ఏ-1 ఎవరంటే ?
లోకాయుక్త అధికారులు అరెస్టు చేస్తారనే భయంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విరుపాక్షప్ప ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు/దావణగెరె: కర్ణాటకలో అధికార పార్టీ ఎమ్మెల్యే దెబ్బతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో పాటు బీజేపీ అధిష్టానం చిక్కుల్లోపడింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మాడాల్ విరూపాక్షప్ప ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లోకాయుక్త అధికారులు అరెస్టు చేస్తారనే భయంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విరుపాక్షప్ప ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే విరుపాక్షప్ప కొడుకు, ప్రభుత్వ అధికారి ప్రశాంత్ అరెస్టు అయ్యి జైలుపాలు కావడంతో ఎమ్మెల్యేకి చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే ఆయన పదవికి విరుపాక్షప్ప రాజీనామా చేశారు.

ఆ ఒక్క లెక్క తప్పింది.... మొత్తం దెబ్బ తీసింది
తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కాంట్రాక్టు అప్పగించడానికి రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా బీజేపీ ఎమ్మెల్యే మాడాల్ విరుపాక్షప్ప కుమారుడు, ప్రభుత్వ ఉద్యోగి ప్రశాంత్ మాడాల్‌ను కర్ణాటక లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కర్నాటక సోప్ అండ్ డిటర్జెంట్ ఫ్యాక్టరీ (కేఎస్‌డీఎల్)లో అధ్యక్షుడు అయిన బీజేపీ ఎమ్మెల్యే మాడాల్ విరుపాక్షప్పకు ఇప్పుడు అరెస్టు భయం పట్టుకుంది.

పదవికి రాజీనామా చేసినా లాభం లేదు
రూ. 40 లక్షల లంచం తీసుకుంటున్న కేసులో ప్రశాంత్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేఎస్ఐఎల్ అధ్యక్ష పదవికి బీజేపీ ఎమ్మెల్యే మాడాల్ విరూపాక్షప్ప రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి బసవరాజ్ బోమ్మయ్ కి పంపించారు. అయితే సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి కొందరు ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ వేచి చూస్తున్నారు.

ఏ-1 ముద్దాయి ఎమ్మెల్యే ?
భారీ గోల్ మాల్ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే మాడాల్ విరుపాక్షప్ప ఏ-1 నిందితుడు అని లోకాయుక్త అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే హడలిపోతున్నారు. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని విరుపాక్షప్ప లోకాయుక్త కోర్టుకు మనవి చేశారు. లోకాయుక్త కోర్టు ఆ పిటిషన్ ను ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలి చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ చేసిన ప్రత్యేక కోర్టు కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ సమర్పించాలని లోకాయుక్త అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో కేసు విచారణ సక్రమంగా చెయ్యాలని లోకాయుక్త అధికారులకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications