మరో ఘోరం: రోడ్డుపై ఎయిర్‌హోస్టెస్ డ్రెస్ చించేశాడు, అసభ్యంగా..

కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఎయిర్ హోస్టెస్‌పై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఎయిర్ హోస్టెస్‌పై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నప్పటికీ పురోగతి లేకపోవడం గమనార్హం.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 10గంటల సమయంలో ఓ ఎయిర్ హోస్టెస్ హెచ్ఆర్‌బీఆర్‌ లే అవుట్‌లోని తన ఇంటి నుంచి స్నేహితురాలితో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. బైకు మీద వచ్చిన వ్యక్తి వారికి సమీపం వచ్చి తాకాడు.

Bengaluru again: Biker molests air hostess in posh locality, FIR lodged

ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేగాక, ఆమె ధరించిన టాప్ చించేశాడు. ఆమె కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు కూడా గట్టిగా కేకలు వేశారు. దీంతో నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇంత వరకు ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. కాగా, ఇటీవల కాలంలో బెంగళూరులో ఇలాంటి వేధింపుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+