బెంగళూరు బంద్ కు గ్రీన్ సిగ్నల్, కొంప ముంచిన ఆర్ టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం
బెంగళూరు: ఐటీ హబ్ బెంగుళూరులోని బిజీ లైఫ్‌లో హాయిగా నిద్రపోవాలని కలలుకనే వీకెండ్ ప్రేమికుల కోసం ఓ గుడ్ న్యూస్ సిద్దంగా ఉంది. ఈ సారి వీకెండ్ ప్రతిసారీ లాగానే ఆదివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోతే సోమవారం పొద్దున్నే నిద్రలేచి వాళ్లు చేసే పనితో కుస్తీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ వారం వీకెండ్ తో పాటు సోమవారం కూడా హ్యాపీగా గడిపేవాళ్ల కోసం ఓశుభవార్త వచ్చింది.
స్కూల్ వ్యాన్ రాగానే తల్లులు తమ పిల్లలను హడావుడిగా సిద్ధం చేసి ఈ సోమవారం తమ పిల్లలను ఎలా బడికి పంపాలో ప్లాన్ చేసుకోవాలి. కర్ణాటకలో శక్తి పథకం అమలు తర్వాత ప్రభుత్వంతో పోరాడుతున్న ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు ఇప్పుడు తమ డిమాండ్ల సాధన కోసం సిద్దరామయ్య ప్రభుత్వం మీద బంద్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాయి.

బైక్‌లు, ట్యాక్సీలపై నిషేధం, డ్రైవర్లకు రాయితీలు తదితర అనేక డిమాండ్‌లు ప్రభుత్వం ముందు ఉంచిన యూనియన్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ వాహనాల సర్వీసులను నిలిపివేసి బంద్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న యూనియన్ లు ప్రభుత్వంతో పాటు సిలికాన్ సిటీ ప్రజలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
శక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత నష్టపోతున్నామని విలపిస్తున్న ప్రయివేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ పలు డిమాండ్లు పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అయితే యూనియన్లు ఇచ్చిన గడువులోగా ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ నిరసన వ్యక్తం చేసింది. ఈ బంద్‌కు 30కి పైగా ప్రైవేట్ సంస్థలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
యూనియన్ లు పిలుపునిచ్చిన బంద్‌కు వివిధ డ్రైవర్ల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ల బంద్ నేపథ్యంలో నగరంలో సుమారు 3 లక్షలకు పైగా ఆటోలు, 1. 5 లక్షల ట్యాక్సీలు, 20 వేల గూడ్స్ వాహనాలు, 5 వేలకు పైగా ప్రైవేట్ స్కూల్ బస్సులు, వ్యాన్ లు, 80 వేల సిటీ ట్యాక్సీలు, కార్పొరేట్ కంపెనీల బస్సులు నిలిపివేసి బంద్ లో పాల్గొనడానికి సిద్దం అయ్యారు.













Click it and Unblock the Notifications