కేపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, ముగ్గులోకి దింపిన లేడీ మోడల్స్, విదేశాల్లో బుక్కీ మకాం!
బెంగళూరు: కర్ణాటక ప్రీమియమ్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ సందర్బంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు బుక్కీని అరెస్టు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ నిర్వహించి విదేశాల్లో తలదాచుకున్న బుక్కీ సయ్యం అనే నిందితుడిని అరెస్టు చేశామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి విదేశాల్లో తలదాచుకున్న బుక్కీలు సయ్యం, మరో వ్యక్తిని అరెస్టు చెయ్యడానికి బెంగళూరు సీసీబీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
2019 ఆగస్టు 31వ తేదీ మైసూరులో కేపీఎల్ లో భాగంగా బళ్లారి టస్కర్స్, హుబ్బళ్ళి టైగర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మైసూరులో జరిగిన కేపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో భారీగా బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని బెంగళూరు సీసీబీ పోలీసులకు సమాచారం అందింది.

1 ఓవర్ కు 10 రన్ లు ఇస్తే రూ. 5 లక్షలు ఇస్తామని మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. 1 ఓవర్ కు 10 రన్ లు ఇచ్చిన వారికి సయ్యం రూ. 5 లక్షలు ఆఫర్ ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో యువతులు, లేడీ మోడల్స్ తో క్రికెట్ ఆటగాళ్లను బుక్కీ సయ్యం సంప్రధించాడని పోలీసులు వివరాలు సేకరించారు.
కేపీఎల్ బెట్టింగ్ కు సంబంధించి విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు ఇప్పటికే బెళగావి ఫ్యాంథర్స్ జట్టు యజమాని అశ్వఖ్ ఆలీ తార్, బళ్లారి టస్కర్స్ టీం డ్రమ్మర్ భవేశ్, బెంగళూరు బ్లాస్టర్స్ టీం బౌలింగ్ కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్ మెన్ విశ్వనాథన్ ను అరెస్టు చేశారు. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి విదేశాల్లో తలదాచుకున్న బుక్కీలను అరెస్టు చెయ్యడానికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సీసీబీ పోలీసులు ఇప్పుడు సయ్యంను అరెస్టు చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications