Bengaluru Rents: ఆకాశాన్నంటుతున్న అద్దెలు - బెంబేలెత్తిపోతున్న సామాన్యులు..!!

ఒకప్పుడు బెంగళూరు నగరంలో స్థిరపడాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఆసక్తి చూపేవారు. తెలుగు రాష్ట్రాల వారే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి ఉద్యోగ రీత్యనో,వ్యాపార రీత్యనో గార్డెన్ సిటీలో స్థిరపడేవారు. ఇక ఐటీ రంగం బెంగళూరు దాని పరిసర ప్రాంతాలకు భారీగా విస్తరించడంతో ఉద్యోగస్తులు, విద్యార్థులు ఆ నగరం వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరులో స్థిరపడాలనుకునే వాళ్లకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బెంగళూరే ముద్దు అన్నవాళ్లు నేడు బెంగళూరు వద్దు అనే పరిస్థితికి చేరుకున్నారు. ఇంతకీ ప్రజలు బెంగళూరును చూసి ఎందుకు బెంబేలెత్తుతున్నారు..?

బెంగళూరు నగరం..ప్రతి పది మందిలో ఆరుగురికి కచ్చితంగా నచ్చే నగరం. అక్కడి వాతావరణం, పచ్చదనం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అంతేకాదు అక్కడ విస్తరించిన ఐటీతో యువత కూడా తమ ఉద్యోగావకాశాల కోసం ఎక్కువగా బెంగళూరు వైపే చూస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తీర బెంగళూరుకు వెళ్లాక అక్కడ ఉండేందుకు ఒక ఇల్లు చూద్దామంటే కాళ్లు అరిగేలా తిరిగినా దొరకడం లేదు. ఒకవేళ దొరికినా ఇంటి ఓనర్లు చెప్పే అద్దె చూస్తే నోట్లో తడారిపోతోంది. మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తోంది.ఇందుకోసమే బెంగళూరు నగరం అంటే ఆసక్తి పోతోందని కొందరు చెప్తున్న మాట.

bengaluru-citizens-urge-the-karnataka-govt-to-frame-policy-over-skyrocketing-rents-and-security-deposit

సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో దోపిడీ

ఇక అసలు విషయానికొస్తే... బెంగళూరు సిటీలో అద్దెలు భారీగా పెరిగిపోయాయి. అద్దె చెల్లించేందుకైన రెడీగా ఉన్నవారు... అంతకంటే ముందు చెల్లించాల్సిన అడ్వాన్స్‌లను చూసి భయపడుతున్నారు. ఉదాహరణకు ఒక రూ.20వేలు అద్దె ఉంటే..చేరడానికి ముందే 10 నెలల అడ్వాన్స్ అంటే రూ.2 లక్షలు కట్టాలనే నిబంధనతో టెనెంట్స్ బెంబేలెత్తిపోతున్నారు. దీంతో బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ భారీ అద్దెలపై కర్నాటక ప్రభుత్వాన్ని కలిసి విన్నవించుకుంది.ఇంటి అద్దెలపై ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఇంటి ఓనర్లు భారీగా దోచుకుంటున్నారని, ఇందుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్నాటక ఆర్టీఐ వర్కర్స్ సేవా సమితి అధ్యక్షుడు విజయ్ డెన్నిస్ సీఎం‌ డీకే శివకుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.అదే సమయంలో అద్దెకు ఉంటున్న వారికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సీఎంను కోరారు.

ఆకాశాన్నంటుతున్న అద్దె ధరలు

బెంగళూరులో ఇంటి అద్దెను ఒకేసారి అమాంతంగా పెంచడంతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా కష్టం అవుతోందని, అదే సమయంలో ఉద్యోగస్థులకు, విద్యార్థులకు, సీనియర్ సిటిజెన్స్, రోజూ వారీ కూలీలకు కూడా భారంగా మారిందని సీఎం డీకే శివకుమార్ దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని దశాబ్దాలుగా బెంగళూరులోనే నివాసం ఉంటూ సొంతంగా ఇల్లులేని వారిపై ఈ భారం మరింతగా పడుతోందని డీకే శివకుమార్ దృష్టికి తీసుకొచ్చారు. నగరంలోని HSR లేఔట్, కోరమంగళ, బెల్లందూర్, మార్తాహళ్లి,వైట్ ఫీల్డ్,ఎలక్ట్రానిక్ సిటీ,సర్జాపూర్ రోడ్ వంటి ప్రాంతాల్లో అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు మధ్య తరగతి ప్రజలు ఆలోచన చేయాలంటేనే భయపడుతున్నారు.

500 చదరపు అడుగులున్న సింగిల్ బెడ్‌రూం ధర నెలకు రూ.30వేలు అద్దె పలుకుతుండగా.. డబుల్ బెడ్‌రూం (2BHK) అద్దె రూ.40వేల నుంచి రూ.50వేల మధ్య ఉంటోంది. ఇక త్రీ బెడ్‌రూం అద్దె గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. దీని అద్దె ఏకంగా రూ.70 వేలు ఉంటోంది. ఇక ఇండిపెండెంట్ హౌజ్, విల్లాస్అయితే నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు వరకు అద్దె పలుకుతున్నాయి. ఈ స్థాయిలో అద్దెలు చెల్లించాక తమ వద్ద ఇతర అవసరాలకు నగదు ఉండటం లేదని మధ్య తరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో మూడునెలలు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నప్పటికీ... ఓనర్లు మాత్రం పది నెలల పాటు డిపాజిట్ చెల్లించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదేంటని గట్టిగా ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే తీసుకో లేదంటే వెళ్లిపో అని ఓనర్లు ముఖంపైనే చెప్పేస్తున్నారు.

సీఎం దృష్టికి బెంగళూరు అద్దె వ్యవహారం

ఇదంతా ఇలా ఉంటే..పౌరులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు కర్నాటక ఆర్టీఐ వర్కర్స్ సేవా సమితి అధ్యక్షుడు విజయ్ డెన్నిస్.ఈ అద్దెల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న కొన్ని లక్షల మందిని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కోరారు. అంతేకాదు బెంగళూరులోని రెంటల్ మార్కెట్ విధానంపై ఒక నిర్దిష్టమైన స్టడీ చేసి మెరుగైన విధానాలను తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు ఒక ఆన్‌లైన్ పోర్టల్ కూడా సిద్ధం చేయాలని, పారదర్శకమైన గైడ్‌లైన్స్ రూపొందించాలని డెన్నిస్ విజ్ఞప్తి చేశారు.

ఒకప్పుడు బెంగళూరు అంటే పరుగులు తీసేవారికి అదే నేటి బెంగళూరును చూసి బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఒక వేళ మీరు బెంగళూరులో నివాసం ఉంటున్నట్లయితే మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+