Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ మీద బదిలి వేటు, గతంలో లాటరీ స్కాం, 35 ఏళ్లకు మళ్లీ !

బెంగళూరు: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ మీద బదిలి వేటు పడింది. అధికారం స్వీకరించిన 47 రోజుల్లో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ ను బదిలి చేస్తూ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 35 ఏళ్ల తరువాత బెంగళూరుకు చెందిన వ్యక్తి బెంగళూరు పోలీసు కమిషనర్ అయ్యారు.

బెంగళూరుకు చెందిన భాస్కర్ రావ్ ను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా నియమించారు. కర్ణాటక రిజర్వ్ పోలీసు విభాగం అడిషనల్ డీఐజీగా పని చేస్తున్న భాస్కర్ రావ్ ను తక్షణం విధుల్లో చేరాలని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Bengaluru City Police Commissioner Alok Kumar transfered.

35 సంవత్సరాల తరువాత బెంగళూరుకు చెందిన ఐపీఎస్ అధికారిని మళ్లీ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా నియమించారు. అలోక్ కుమార్ ను కర్ణాటక రిజర్వ్ పోలీసు విభాగం అడిషనల్ డీఐజీగా బదిలి చేశారు. గతంలో అలోక్ కుమార్ అవినీతి నిరోదక దళం ఏడీజీపీగా, బెంగళూరు క్రైం బ్రాంచ్ లో పని చేశారు.

సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన లాటరీ స్కాంలో ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ పేరు బయటకు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. అలోక్ కుమార్ తో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారులను యడియూరప్ప ప్రభుత్వం బదిలి చేసింది.

బెంగళూరు ఇంటిలిజెన్స్ విభాగం డీఐజీ సుబ్రమణ్యేశ్వర్ రావ్ ను మంగళూరు నగర పోలీసు కమిషనర్ గా బదలి చేశారు. మంగళూరు నగర పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ తో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారులను బదిలి చేస్తూ యడియూరప్ప ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+