బెంగళూరులో ఈ రద్దీ రూట్ లో ఎలివేటెడ్ కారిడార్.. !!

బెంగళూరులో అత్యంత రద్దీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందించింది. శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరింత మెరుగైన కనెక్టివిటీని కల్పించడంతో పాటు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ కారిడార్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న వైట్ ట్యాపింగ్, రోడ్డు మరమ్మతులను నిర్ణీత కాలపరిమితితో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది.

బెంగళూరులో రద్దీ మార్గాల్లో ఒకటి.. హెన్నూరు- బాగలూరు రోడ్. ఏడాదిన్నర కాలంగా ఇక్కడ వైట్ టాపింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో జాప్యం చోటు చేసుకోవడం పట్ల వాహనదారుల నుంచి నిరసనలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో బెంగళూరు అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. రాబోయే రెండు నెలల్లోగా పనులన్నింటినీ ముగించాలని ఆదేశించారు. దీంతో పాటు రహదారి విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.

Bengaluru Considers Elevated Corridor or Short Flyovers on Hennur Bagalur Road to Ease KIA Traffic

అదే సమయంలో హెన్నూరు జంక్షన్ నుంచి గెద్దలహళ్లి వరకు సాగుతున్న మౌలిక సదుపాయాల పనుల పురోగతిని స్థానిక కేఆర్‌ పురం శాసనసభ్యుడు బైరతి బసవరాజ్‌ తో కలిసి పరిశీలించారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ కీలకమని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వరదనీటి కాలువల మరమ్మతు, పునరుద్ధరణ పనులను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు. ఫుట్‌పాత్ లను బాగు చేయాలని, కామ్‌వేలను మరింత విస్తరించాలని అన్నారు.

బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ సీరియస్ వార్నింగ్..!!
బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ సీరియస్ వార్నింగ్..!!

వాహనాల తాకిడి పెరిగిన నేపథ్యంలో హెన్నూరు- బాగలూరు మధ్య ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణాన్ని చేపడతామని, రాబోయే అయిదేళ్ల కాలంలో ఈ మార్గాన్ని పూర్తిగా సిగ్నల్ రహిత రహదారిగా తీర్చిదిద్దుతామని కృష్ణ బైరేగౌడ స్పష్టం చేశారు. దీనికోసం ప్రధాన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి అవసరమైన సాధ్యసాధ్యాల అధ్యయనం చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.

గోదావరి-కావేరి నదుల లింకేజీ, హోసూర్- బెంగళూరు మెట్రో రైల్: ప్రధాని మోదీకి విజయ్ ప్రతిపాదనలు
గోదావరి-కావేరి నదుల లింకేజీ, హోసూర్- బెంగళూరు మెట్రో రైల్: ప్రధాని మోదీకి విజయ్ ప్రతిపాదనలు

సాధ్యసాధ్యాల నివేదికను పరిశీలించిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కుదరని పక్షంలో.. రోడ్డుపై ఉన్న అన్ని ప్రధాన సిగ్నల్ పాయింట్ల వద్ద ఫ్లైఓవర్లను నిర్మించి ఈ మార్గాన్ని వాహనాల రాకపోకల కోసం మరింత సులభతరం చేస్తామని కృష్ణ బైరేగౌడ పేర్కొన్నారు. విమానాశ్రయానికి కనెక్టివిటీ కల్పించడానికి అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ వినియోగించుకుంటామని, ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+