నకిలీ రూ.2వేల నోటు తయారీ, పోలీసులే ఆశ్చర్యపోయారు

రూ.2 వేల కొత్త నోట్లకు నకిలీలు పుట్టుకు వస్తున్నాయి. బెంగళూరులో నకిలీ రెండువేల నోట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు: రూ.2 వేల కొత్త నోట్లకు నకిలీలు పుట్టుకు వస్తున్నాయి. బెంగళూరులో నకిలీ రెండువేల నోట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరు నకిలో నోట్లు తయారు చేసిన తీరు చూసి పోలీసులే ఆశ్యర్యపోయారు.

 Bengaluru cops arrest 4 for producing fake Rs 2000 notes

శశాంక్‌, మధుకుమార్‌ అనే ఇద్దరు యువకులు కొత్త రూ.2000 నోటుకు నకిలీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ స్నేహితుడి దుకాణంలో కలర్‌ జిరాక్స్‌ తీశారు. ఆ తర్వాత నోటు పైన పచ్చటి మెరుపు పెన్నుతో రంగులు వేశారు.

కాగితాన్ని సరిగ్గా రూ.2వేల నోటు సైజులో కత్తిరించారు. ఇలా ఇరవైకి పైగా నోట్లను ముద్రించారు. వాటిని ఎనిమిది మద్యం దుకాణాల్లో ఇచ్చారు. నాలుగైదు రోజులుగా ఇలాగే చేస్తున్నారు. మద్యం దుకాణదారుడికి అనుమానం వచ్చి పరిశీలించగా.. అది నకిలీ కరెన్సీ అని తేలింది. పోలీసులకు సమాచారం అందించాడు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+