Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీక్రెట్ ప్లోర్‌లో హైటెక్ సెక్స్‌రాకెట్: పోలీసులే అవాక్కయ్యారు

బెంగుళూరు: ఈ సీన్ సినిమాలో ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ లాడ్జిపై పోలీసులు పలుమార్లు దాడులు నిర్వహించిన ఎటువంటి ఆధారాలు లభించలేదు. గత రెండేళ్ల కాలంలో సుమారు ఆరుసార్లు అదే హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారంటే ఏ రేంజ్‌లో ఆ హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందో అర్ధం చేసుకోండి.

చివరకు ఏడోసారి బెంగుళూరు పోలీసులు దాడులు నిర్వహించి సెక్స్ రాకెట్ నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... బెంగళూరు‌‌లో ఉన్న క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్‌కు సమీపంలోని ఎన్‌టీ పెటెలో శివ ప్యాలెస్ డీలక్స్ లాడ్జి ఉంది.

ఈ త్రీ స్టార్ హోటల్‌కు పక్క రాష్ట్రాల నుంచి ఉద్యోగాల పేరిట అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇదే విషయం పలుమార్లు పోలీసులకు సమాచారం అందింది. గత రెండేళ్లలో ఆరుసార్లు ఆ లాడ్జిపై దాడులు నిర్వహించిన పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు.

Bengaluru cops find secret brothel in 3-star hotel after 6 failed attempts

వ్యభిచారంపై పక్కా సమాచారం ఉన్నా సెక్స్ రాకెట్ గుట్టును మాత్రం ఛేదించలేకపోయారు. అయితే ఈ సారి సీసీబీ పోలీసులు ఆ లాడ్జిపై దాడులు నిర్వహించారు. హోటల్‌లో ప్రతి అంగుళం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హోటల్‌ను తదేకంగా పరిశీలించారు.

స్కానింగ్ పరికరాలతో హోటల్‌లోని గోడలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు హోటల్‌లో రహస్యంగా ఓ ప్లోర్ ఉన్నట్లు అనుమానం వచ్చింది. దీంతో ఫస్ట్ ఫ్లోర్, సెకెంట్ ఫ్లోర్‌కు మధ్యలో రహస్యంగా ఓ డోర్ ఉన్నట్టు గుర్తించారు.

డోర్‌ను బద్దలు కొట్టి చూస్తే తక్కువ ఎత్తులో ఓ ఫ్లోర్ కనిపించింది. లాడ్జి నిర్వాహకులు అందులోనే సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. హోటల్ నిర్వాహకుల తెలివి తేటలను చూసి ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. హోటల్ బయట నుంచి కానీ లోపల నుంచి చూస్తే ఈ ఫ్లోర్ ఉన్నట్టే కనిపించడం లేదని పోలీసులు చెప్పారు.

ఇదే ఫ్లోర్‌లో సెక్స్ రాకెట్‌ను నిర్వహించే హోటల్ నిర్వహకులు పోలీసులు దాడులకు వెళ్లినప్పుడు హోటల్ ఓనర్ కాలింగ్ బెల్ నొక్కి కస్టమర్లను హెచ్చరించేవాడు. దీంతో ఈ ప్లోర్‌లోని కస్టమర్లు సీక్రెట్ డోర్ తెరుచుకుని నేరుగా హోటల్ వెనుక ఉన్న రోడ్డుపై ద్వారా తప్పించుకునేవారని అన్నారు.

మరోవైపు హోటల్ యజమాని అదే భవంతిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రిటైల్ షాపు నడుపుతుండటంతో కస్టమర్లు వచ్చినా, వెళ్లినా ఎవరీ పెద్దగా అనుమానం వచ్చేది కాదని పోలీసులు చెప్పారు. ఇలా పోలీసుల కళ్లు గప్పి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న హోటల్ యజమానితో పాటు కొంత మందికి బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులతో ఈ సెక్స్ రాకెట్‌ను నడిపిస్తున్నారని, వారి నుంచి ఆయా రాష్ట్రాలకు చెందిన యువతులను రక్షించామని పోలీసులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+