రాహుల్ కు షాక్ ఇచ్చిన కోర్టు, క్యూలో సీఎం, డీసీఎం, అందరూ కోర్టుకు రండి, సమన్లు జారీ !
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంలో ఉచిత హామీ పథకం ప్రభావం ఎంత ఉందో, బీజేపీపై 40% కమిషన్ ఆరోపణ కూడా అంతే ప్రభావం చూపింది. నాటి బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ పొంది అన్ని కాంట్రాక్టు పనులు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇదే ఆరోపణ రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లకు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు రెండు వ్యూహాలు రచించారు. ఈ వ్యూహాలలో ఒకటి ఉచిత హామీల పథకాలను హైప్ చేయడం, మరోవైపు అప్పటి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లడం అని ప్లాన్ చేశారు. దీని ద్వారా కర్ణాటక ఓటర్ల దృష్టిని కూడా కాంగ్రెస్ నేతలు ఆకర్షించి వారి మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు ఇదే ప్లాన్ కాంగ్రెస్ నేతలకు పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మరోసారి చిక్కు వచ్చి పడింది.

రాహుల్ గాంధీకి ఎదురైన సమస్యలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిత్తరపోయారు. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ నేతలు 40% కమీషన్ వసూలు చేశారని ఆరోపణలు చెయ్యడంతో బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీని ద్వారా కాంగ్రెస్ నేతలపై న్యాయపరమైన యుద్ధం ప్రకటించారు. ఈ యుద్దం ఇప్పుడు ఫలించి కాంగ్రెస్ నేతలకు పెద్ద చిక్కు వచ్చిపడింది. దీంతో పాటు రాహుల్ గాంధీకి కూడా పెద్ద చిక్కు వచ్చి పడింది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులకు కోర్టు షాక్ ఇచ్చింది. కర్ణాటకలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ లసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు సంబంధించి బెంగళూరు కోర్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. దీంతో పాటు వ్యక్తిగతంగా హాజరు కావాలని ముగ్గురు నాయకులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ ఎదురైయ్యింది.
40% కమీషన్ ఆరోపిస్తూ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ విజయం సాధించింది. అదే సమయంలో పే సీఎం (Pay CM) పోస్టర్ వివాదం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి వ్యతిరేకంగా 'పే సీఎం' పోస్టర్లు కూడా వేశారు. ఇది చాలదన్నట్లు కాంగ్రెస్ నేతలు అప్పటి బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కర్ణాటకలోని ప్రధాన వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేసి అప్పటి బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో బసవరాజ్ బోమ్మయ్ అవినీతి రేటు కార్డును కూడా విడుదల చెయ్యడంతో అది వివాదానికి దారితీసింది.

ఈ ముగ్గురూ మార్చి 28వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల ముందే రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, డీకే శివకుమార్ లకు బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications