హీరోను రిమాండ్ కు పంపించిన కోర్టు, గతంలో కూడా సార్ కు చిప్పకూడు, జడ్జితో పెట్టుకుంటే ?
బెయిల్ తీసుకుని బయటకు రావాలని హీరో చేతన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గతంలో జడ్జి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన హీరో చేతన్ జైలుకు వెళ్లాడు.
బెంగళూరు: కన్నడ హీరో, సామాజిక సేవా కార్యకర్త చేతన్ అలియాస్ చేతన్ అహింసను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తూ కన్నడ హీరో చేతన్ మీద బెంగళూరులోని శేషాధ్రిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. బెయిల్ తీసుకుని బయటకు రావాలని హీరో చేతన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గతంలో జడ్జి మీద అనుచితక వ్యాఖ్యలు చేసిన హీరో చేతన్ జైలుకు వెళ్లాడు.

బెంగళూరు కోర్టు ముందు హీరో చేతన్
బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు హీరో చేతన్ ను అరెస్టు చేసి బెంగళూరులోని 32వ ఏసీఎంఎం కోర్టు ముందు హాజరుపరిచారు. చేతన్ హిందూ దేవుళ్లను కించరచడమే కాకుండా సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడని పోలీసులు ఎఫ్ఐఆర్ కోర్టు ముందు సమర్పించారు. ఇదే సందర్బంలో హీరో చేతన్ న్యాయవాది అతనికి బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో మనవి చేశారు.

సాక్షాలు లేవని చెప్పిన లాయర్
సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లను కించపరిచి చేతన్ పోస్టులు చేశాడని అని చెప్పడానికి ఎలాంటి సాక్షాలు లేవని అతని న్యాయవాది కోర్టుకు చెప్పారు. గతంలో కూడా హిందూ దేవుళ్లను కించపరిచి చేతన్ సోషల్ మీడియాలో అనేక పోస్టులు చేశాడని, కేసు విచారణలో ఉన్నందున అతనికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని బెంగళూరు పోలీసులు కోర్టుకు మనవి చేశారు.

జైలుకు వెలుతూ హీరోయిజం చూపించిన నటుడు
వాదనలు విన్న న్యాయమూర్తి హీరో చేతన్ ను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. భారీ బందోబస్తుతో పోలీసు జీపులో హీరో చేతన్ ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. జైలుకు వెలుతున్న సమయంలో హీరో చేతన్ పిడికిలి బిగించి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసినా పోలీసు జీపు మాత్రం రయ్ అంటూ ముందుకు వెళ్లిపోయింది.

హిజాబ్ టైమ లో జడ్జ్ ను కామెంట్ చేసి జైలుకు వెళ్లాడు
కన్నడ హీరో చేతన్ హిందూ ఆరాధ్యదైవం రాముడు రావణాసురిడిని ఓడించి ఆయోధ్యకు చేరుకున్నాడు అనేది అపద్దం, బాబ్రీ మసీదు ఉన్న చోటు రాముడి జన్మభూమి అని చెప్పడం ఓ పెద్ద అపద్దం, టిప్పు సుల్తాన్ ను ఉరిగౌడ, నంజేగౌడలు చంపేశారని ఇప్పుడు మరోసారి కొత్తగా అపద్దాలు చెబుతున్నారని, అసలు హిందూ ధర్మమే ఓ కట్టుకథ అని హీరో చేతన్ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.
గతంలో హిజాబ్ వివాదం కోర్టులో ఉన్న సమయంలో ఓ న్యాయమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన హీరో చేతన్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. హిజాబ్ వివాదం కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన హీరో చేతన్ మరోసారి అరెస్టు అయ్యి జైలుకు పోయాడు.












Click it and Unblock the Notifications