బ్యాంకాక్ నుంచి ఎందుకు వచ్చాడంటే ?, చెప్పుల్లో కేజీకి పైగా బంగారం, రా...రా...రారా బంగారం, నువ్వే ?
విమానాశ్రయంలో చెప్పుల్లో కేజీలు కేజీలు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు బ్యాంకాక్ నుంచి వచ్చాడు.
బెంగళూరు/బ్యాంకాక్: బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బంగారం ఎవరి చేతిలో ఎంత ఎక్కువ ఉంటే వాడే కింగ్.అక్రమంగా బంగారాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో చెప్పుల్లో కేజీలు కేజీలు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు బ్యాంకాక్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారని పోలీసు అధికారులు చెప్పారు.

బెంగళూరు ఎయిర్ పోర్టు
బ్యాంకాక్ నుంచి బెంగళూరు వచ్చిన ఇండిగో ఎయిర్‌వేస్ విమానాన్ని తనిఖీల నిమిత్తం నిలిపివేశారు. అందులో ఒక ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతని వస్తువులన్నీ తనిఖీ చేశారు. అతని చెప్పుల్లో దాచిపెట్టిన బంగారు ముక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

చెప్పుల్లో కేజీకి పైగా బంగారం పెట్టిన నిందితుడు
నిందితుడి చెప్పుల్లో రూ. 69.40 లక్షల విలువైన బంగారం లభించిందని అధికారులు అన్నారు. అతను అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అతని చెప్పులు స్కానింగ్ చేయగా చెప్పుల లోపల బంగారు ముక్కలు కనిపించాయని అధికారులు అన్నారు. కస్టమ్స్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 24 క్యారెట్లు కలిగిన 1. 2 కిలోల బంగారాన్ని అతని చెప్పుల నుంచి స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

చికిత్స కోసం బ్యాంకాక్ నుంచి వచ్చాను
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ధర మార్కెట్ లో రూ. 69. 40 లక్షల రూపాయలు అని తెలిసింది. ఇండిగో ఫ్లైట్ 6 ఈ 76లో బ్యాంకాక్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రయాణికుడిని బెంగళూరు కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అడ్డుకున్నారు. నువ్వు ఎందుకు బెంగళూరు వచ్చావు అని అధికారులు ఆ ప్రయాణికుడిని ప్రశ్నించారు. ప్రయాణీకుడు తాను వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెంగళూరు వచ్చానని అపద్దం చెప్పాడని పోలీసు అధికారులు తెలిపారు.

ఆసుపత్రి పేరు కూడా చెప్పలేకపోయాడు
అయితే ఆ ప్రయాణీకుడు బెంగళూరులో ఏ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పలేదని కనీసం వైద్యం కోసం వచ్చినట్లు అతని దగ్గర ఎలాంటి పత్రాలు చిక్కలేదని అధికారులు అన్నారు. దీంతో అధికారులకు అనుమానం వచ్చి అతన్ని లగేజ్ ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతని బ్యాగు, షూలను తనిఖీ చేశారు. స్కానింగ్ చేయగా నిందితుడు బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు ప్రయాణించడానికి వేసుకున్న చెప్పులు కోసి చూడగా బంగారు ముక్కల బయటకు వచ్చాయని, అతని చెప్పుల్లో 1.2 కిలోల బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్, పోలీసు అధికారులు తెలిపారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications