Lady techie: లేడీ టెక్కీ పెన్ డ్రైవ్ లో ఆమె పర్సనల్ ఫోటోలు, వీడియోలు, రోడ్డు మీద చిక్కిందని ?

బెంగళూరు: యువతికి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చెయ్యడానికి ఆ యువతి సొంత సిటీ వదిలేసి ఐటీ హబ్ చేరుకుంది. ఉద్యోగం చేస్తున్న యువతి అద్దె ఇంటిలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. వీకెండ్ సమయంలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న యువతి ఫ్రెండ్ బైక్ లో బయలుదేరింది. బైక్ లో వేగంగా వెలుతున్న సమయంలో యువతి జీన్స్ ప్యాంట్ లో ఉన్న పెన్ డ్రైవ్ కిందపడిపోయింది. ఇంటికి వెళ్లిన యువతి పెన్ డ్రైవ్ కనపడకపోవడంతో టెన్షన్ పడిపోయింది. కొన్ని రోజులకు ఆఫీసులో ఉన్న లేడీ టెక్కీ మొబైల్ ఫోన్ కు కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ కావడంతో హడలిపోయింది. లేడీ టెక్కీ ఏకంతంగా ఉన్న సమయంలో తీసిన ఆమె ఫోటోలు, వీడయోలు ఆమె చూసి షాక్ అయ్యింది.

ముంబాయి టూ బెంగళూరు

ముంబాయి టూ బెంగళూరు

ముంబాయికి చెందిన ఓ యువతికి బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ముంబాయి నుంచి ఆ యువతి బెంగళూరు వచ్చింది. లేడీ టెక్కీకి సంబంధించిన ఓ పెన్ డ్రైవ్ రోడ్డు మీద పడిపోయింది. రోడ్డుపై దొరికిన పెన్ డ్రైవ్ లో ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు చూపించి యువతిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న నిందితుడిని బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన ఆ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూరులోని బేగూర్ రోడ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నది.

ఫోన్ నెంబర్ చిక్కింది..... పండగ చేసుకోవాలని అనుకున్నాడు

ఫోన్ నెంబర్ చిక్కింది..... పండగ చేసుకోవాలని అనుకున్నాడు

నిందితుడు షోయబ్ కు రోడ్డు మీద ఈ పెన్ డ్రైవ్‌ చిక్కింది. ఈ పెన్ డ్రైవ్‌ను తెరిచిన అనంతరం షోయబ్ కు ఓ అందమైన యువతి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు కనిపించాయి. పెన్ డ్రైవ్ లో దొరికిన డాక్యుమెంట్ల పరిశీలించిన షోయర్ ఆ యువతి మొబైల్ నంబర్ గుర్తించాడు. తరువాత పెన్ డ్రైవ్ లోని ఆమె ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను ఆమె వాట్సాప్ కు పంపించాడు. ఫోటోలు, వీడియోలతో పాటు పెన్ డ్రైవ్ ఫోటో తీసిన షోయబ్ ఆ లేడీ టెక్కికి పంపాడు.

టార్చర్ పెట్టాడు.... దూలతీరిపోయింది

టార్చర్ పెట్టాడు.... దూలతీరిపోయింది

కొన్ని రోజులకు షోయబ్ ఆయువతితో చాటింగ్ ప్రారంభించాడు. నీ పెన్ డ్రైవ్ నీకు తిరిగి ఇవ్వాలంటే తనకు రూ. 70 వేల ఇవ్వాలని, నేను ఇచ్చే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి నా బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు డిపాజిట్ చేయాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. షోయబ్ రోజురోజుకు ఎక్కువ టార్చర్ పెట్టాడు. షోయబ్ టార్చర్ తట్టుకోలేని లేడీ టెక్కీ బెంగళూరు సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లేడీ టెక్కీ ఫిర్యాదు ఆధారంగా పక్కా స్కెచ్ వేసిన పోలీసులు నిందితుడు షోయబ్ ను డబ్బులు ఇస్తామని పిలిపించి అరెస్ట్ చేశారు. లేడీ టెక్కీని టార్చర్ పెట్టిన షోయబ్ ను జైలుకు పంపించామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు షోయబ్ లేడీ టెక్కీ ఫోటోలు, వీడియోలు ఎవరికైనా షేర్ చేశాడా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. డబ్బు కోసం యువతి పరువు బజారులో పెట్టడానికి ప్రయత్నించిన షోయబ్ కు పోలీసులు బెండ్ తీశారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+