బెంగళూరులో మహిళా డీజే ఫుడ్ ఆర్డర్ చేస్తే వెళ్లి నీతో ఉంటా, ఏమైనా చేద్దామా, కుక్కతో!
బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మహిళా డీజే (డిస్క్ జాకీ)తో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బాధితురాలు చివరికి తన పెంపుడు కుక్కను వదలడంతో అది వెళ్లి కామాంధుడి కండపీకేసింది. మహిళా డీజే కథనం మేరకు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఒంటరిగా మహిళా డీజే
బెంగళూరులో ఇండిపెండెంట్ హౌస్ లో మహిళా డీజే ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈమె ఆన్ లైన్ లో ఫుడ్ (ఆహారం) అర్డర్ ఇచ్చారు. విగ్నేష్ అనే యువకుడు ఫుడ్ తీసుకుని మహిళా డీజే ఇంటి దగ్గరకు వెళ్లాడు. తరువాత ఆమె మొబైల్ కు ఫోన్ చేశాడు.

గేట్ తీసుకుని వెళ్లాడు
ఆ సమయంలో తాను మొదటి అంతస్తులో ఉన్నానని, గేట్ దగ్గర ఉంటే వస్తానని మహిళా డీజేపీ విగ్నేష్ కు చెప్పారు. అయితే విగ్నేష్ నేరుగా గేట్ తీసుకుని ఇంటి గుమ్మం ముందుకు వెళ్లిపోయాడు. ఆ సందర్బంలో బయటకు వచ్చిన మహిళా డీజే డబ్బు ఇచ్చి ఫుడ్ తీసుకున్నారు.

ఏమైనా చేద్దాం !
ఫుడ్ డెలవరీ ఇచ్చిన విగ్నేష్ నువ్వు ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు, బోర్ కొట్టదా ? నేను తోడుగా ఉంటాను, ఏమైనా చేద్దాం అంటూ అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ సమయంలో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లాలని ఆమె విగ్నేష్ ను హెచ్చరించారు.

కండపీకేసిన కుక్కు
ఆ సమయంలో విగ్నేష్ ఇంకా రెచ్చిపోయి పురుషపదజాలంతో దూషించడం మొదలు పెట్టాడు. సహనం కోల్పోయిన మహిళా డీజే తన పెంపుడు కుక్కను వదలిపెట్టడంతో అది విగ్నేష్ మీద దాడి చేసి కండపీకేయడంతో అతను అక్కడి నుంచి పరారైనాడు.

కేసు వద్దు వార్నింగ్
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు వివరాలు సేకరించి విగ్నేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విగ్నేష్ ను జైలుకు పంపిస్తామని పోలీసులు చెప్పడంతో ఆమె కేసు వద్దని, ఈ ఒక్కసారికి వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టాలని మనవి చేశారు. డెలివరీబాయ్ ను ఉద్యోగంలో నుంచి తొలగించామని ఆ సంస్థ నిర్వహకులు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications