pushpa: అందమైన భార్య మీద రెండో భర్తకు డౌట్, జంప్, లెక్క సరిపోలేదు పుష్పా, సెటిల్ చేస్తా !
నా భార్యకు అక్రమ సంబందం ఉందని తెలుసుకున్న ఆమె రెండో భర్త రగిలిపోయాడు. భార్య మీద కోపంతో ఆమె మొదటి భర్తకు పుట్టిన కొడుకును పక్కాప్లాన్ తో చంపేశాడు.
బెంగళూరు/కేజీఎఫ్: వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రానురాను దంపతుల మద్య పంచాయితీలు ఎక్కువ కావడంతో భర్తకు గుడ్ బై చెప్పిన మహిళ పిల్లలతో కలిసి ఒంటరిగా ఉండేది. ఆ సమయంలో నిన్ను పెళ్లి చేసుకుని నీ ఇద్దరు పిల్లలను హ్యాపీగా చూసుకుంటానని ఓ యువకుడు ఆమెకు దగ్గర అయ్యాడు. మహిళ అతన్ని రెండో పెళ్లి చేసుకుంది. నా భార్యకు అక్రమ సంబందం ఉందని తెలుసుకున్న ఆమె రెండో భర్త రగిలిపోయాడు. భార్య మీద కోపంతో ఆమె మొదటి భర్తకు పుట్టిన కొడుకును పక్కాప్లాన్ తో చంపేసిన రెండో భర్త అతని భార్య మీద పగ తీర్చుకోవడం కలకలం రేపింది.

మొదటి భర్తతో విడిపోయింది
బెంగళూరులో నివాసం ఉంటున్న పుష్పా అనే మహిళ చాలా అందంగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం పుష్పాకు వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న పుష్పాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్ద కుమారుడి పేరు చేతన్. పిల్లలు పుట్టిన తరువాత పుష్పా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త తీరుతో విసిగిపోయిన పుష్పా అతనితో విడిపోయి ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా కాపురం పెట్టింది.

పుష్పా హైట్, వెయిట్, కలర్ చూసి ?
భర్తను వదిలేసి పిల్లలతో కలిసి జీవిస్తున్న పుప్పాకు బెంగళూరులో నివాసం ఉంటున్న సంపత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. మొదట పుష్పా, సంపత్ ఇద్దరూ స్నేహితులుగానే ఉన్నారు. తరువాత అక్రమ సంబంధం పెట్టుకున్న పుష్పా, సంపత్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. పుష్పా అందం, ఆమె కలర్ హైట్, వెయిట్ చూసి మోజు పెంచుకున్న సంపత్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

రెండో పెళ్లి చేసుకున్న పుష్పా
నేను నిన్ను పెళ్లి చేసుకుని నీ ఇద్దరు పిల్లలను హ్యాపీగా చూసుకుంటానని సంపత్ మాయమాటలు చెప్పి పుష్పాకు ఇంకా దగ్గర అయ్యాడు. గత ఏడాది సంపత్, పుష్పా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. సంపత్ ను పుష్పా రెండో పెళ్లి చేసుకుని అతనితో కాపురం ఉంటున్నది, ఇదే పమయంలో నా భార్య పుష్పాకు అక్రమ సంబందం ఉందని తెలుసుకున్న ఆమె రెండో సంపత్ రగిలిపోయాడు. ఇదే వియంలో కొంతకాలం సంపత్, పుష్పాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

భార్య మీద పగతో ?
నిత్యం గొడవలు ఎక్కువ కావడంతో పుష్పా ఆమె మొదటి భర్తకు పుట్టిన చేతన్ ను బెంగళూరు శివార్లలోని బాగూరులోని హాస్టల్ లో పెట్టి చదివిస్తోంది. గొదవలు ఇంకా ఎక్కువ కావడంతో విసిగిపోయిన పుష్పా ఆమె రెండో భర్త సంపత్ ను వదిలేసి మరో కుమారుడితో కలిసి బెంగళూరు శివార్లలోకి వెళ్లిపోయి అక్కడే ఒంటరిగా ఉంటున్నది. తనను మోసం చేసిన పుష్పా వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తోందని ఆమె రెండో భర్త సంపత్ ఇంకా రగిలిపోయాడు.

బిరియాని తినిపించి పిల్లాడిని చంపేశాడు
తనతో పాటు వచ్చి కాపురం చెయ్యాలని సంపత్ అతని భార్య పుష్పాకు పదేపదే ఫోన్లు చేసి వేధించాడు. అయితే రెండో భర్త సంపత్ తో కాపురం చెయ్యడానికి పుష్పా నిరాకరించింది. పుష్పా మీద రగిలిపోయిన సంపత్ నేరుగా బాగలూరులోని హాస్టల్ కు వెళ్లి అక్కడే ఉంటున్న పుష్పా మొదటి భర్త కుమారుడు చేతన్ ను పిలుచుకుని వెళ్లి హోస్ కోటేలో ఫేమస్ బిరియాని తినిపించాడు.

రెండో భర్త మీద పుష్పాకు డౌట్
తరువాత పుష్పాకు ఫోన్ చేసిన సంపత్ నాతో వస్తావా రావా అంటూ అడిగాడు, చచ్చినా నీతో వచ్చి కాపురం చెయ్యను అని పుష్పా తేల్చి చెప్పింది. చేతన్ ను హత్య చేసిన సంపత్ తరువాత అతని శవాన్ని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ సమీపంలోని చెరువులో విసిరేసి పరారైనాడు. కుమారుడు చేతన్ కనిపించకపోవడంతో పుష్పాకు అనుమానం వచ్చి సంపత్ ను నిలదీసింది.

లెక్క సరిపోలేదు పుష్పా..... సెటిల్ చేసేశా
నీ కొడుకు చేతన్ ను నేనే చంపేశాను, నీకు చేతనైయ్యింది చేసుకో అని ఎదురు తిరిగాడు. పుష్పా ఫిర్యాదు చెయ్యడంతో ఆమె రెండో భర్త సంపత్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే చేతన్ ను తానే హత్య చేశానని సంపత్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. తల్లి రెండో భర్త చేతిలో బాలుడు హత్యకు గురికావడం బెంగళూరులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications