చిన్నమ్మ కోసం రూల్స్ బ్రేక్, వీవీఐపి సేవలు

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మ శశికళ కోసం జైలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారనే ఇండియాటుడే ఓ కథనాన్ని ప్రసారం చేసింది.

బెంగుళూరు:ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మ శశికళ కోసం జైలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారనే ఇండియాటుడే ఓ కథనాన్ని ప్రసారం చేసింది.

బెంగుళూరు సెంట్రల్ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఒక్క విజిటర్ ను ఆమె కలవడానికి అనుమతిస్తున్నారని వెల్లడైంది.31 రోజుల్లో 27 మంది విజిటర్లు ఆమెను కలవడానికి వచ్చారు.

శశికళ బెంగుళూరు జైలులో శిక్షను అనుభవిస్తోంది.జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె శిక్షను అనుభవిస్తున్నారు.

అయితే 31 రోజుల్లో ఆమె 27మంది విజిటర్లను కలుసుకొన్నారు.అయితే ఒక్క విజిటర్ ను కలవడం కూడ నిబంధనలకు విరుద్దమే.కాని,శశికళ కోసం అధికారులు విజిటర్లను యధేచ్చగా అనుమతిస్తున్నారు.

Bengaluru jail rules violated for VVIP prisoner Sasikala

సాధారణ ఖైదీల మాదిరిగా కాకుండా శశికళ టీమ్ కు వీవీఐపి తరహలో సేవలను అందిస్తున్నట్టుగా మీడియా ప్రసారం చేస్తోంది.ఈ మేరకు ఇండియాటుడే ఈ మేరకు ఓ కథనాన్ని ప్రసారం చేసింది.సాధారణంగా ఉదయం 11 గంటల నుండి 5 గంటలలోపు విజిటర్లు కలవాలి. కాని, కొన్ని సమయాల్లో సాయంత్రం ఐదు తర్వాత కూడ శశికళను కలిసేందుకు వచ్చారని ఇండియా టుడే కథనం చెబుతోంది.

వారానికోసారి లేదా 15 రోజుల్లో ఓసారి మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వడానికి మాత్రమే అర్హులై ఉంటారు. ఇప్పటివరకు శశికళను, ఇలవరసిని కలవడానికి వచ్చిన విజిటర్ల జాబితాను ఇండియాటుడే రాబట్టింది.ఆ జాబితా ప్రకారంగా 2017 ఫిబ్రవరి 16 నుండి మార్చివరకు చెన్నైకు చెందిన అడ్వకేట్లు, ఎంపీలు,ఎమ్మెల్యేలు జైలుకు వచ్చి కలిసినట్టుగా ఇండియా టుడే వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+