ప్రైవేట్ ట్యాంకర్లు వైపు చూస్తున్న బెంగళూరు అధికారులు, కడుక్కోవడానికి నీళ్లు కరువు !
ఐటీ హబ్ బెంగళూరు సిటీలో ఈసారి ఎండ విపరీతంగా పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలతో బెంగళూరు ప్రజలు అల్లాడిపోతున్నారు. బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. మరోవైపు బెంగళూరులో నీటి సరఫరా చేసేందుకు జలమండలి బోర్డు సిద్ధమైంది. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో నీటి సరఫరా కోసం బీడబ్ల్యూఎస్ఎస్ బీ ప్రైవేట్ ట్యాంకర్‌ను సంప్రదిస్తోంది.
నీరు సరఫరా చెయ్యకుండా నిరుపయోగంగా నిలిపి ఉంచిన వాటర్ ట్యాంకర్లను అద్దెకు ఇవ్వాలని జలమండలి ఆ ట్యాంకర్ల యజమానులకు సూచించింది. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన రేటు ఆధారంగా ప్రైవేట్ ట్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని జలమండలి నిర్ణయించింది. ప్రయివేటు నీటి ట్యాంకర్ల యజమానులకు నెలవారీ అద్దె చెల్లించాలని సంబంధిత అధికారులకు జలమండలి ఆదేశించింది. వాటర్ ట్యాంకర్లు అద్దెకు ఇవ్వాలని అనుకుంటున్న వాటర్ ట్యాంకర్ యజమానులు జలమండలి బోర్డు నోడల్ అధికారి జయశంకర్‌ను సంప్రదించాలని సూచించారు.

బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో కావేరీ నీరు అంతంతమాత్రంగా సరఫరా కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బెంగళూరు సిటీలోని మహదేవపుర అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో వందల సంఖ్యలో బోరు బాబులు ఎండిపోవడంతో తాగునీటితో పాటు నిత్యవసర అవసరాలకు ఉపయోగించుకునే నీరు లేక సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో ట్రాకర్ నీరు రూ. 650 నుండి రూ 800కు ఇస్తున్న ట్యాంకర్ యజమానులు రెండు వారాల క్రితం రూ. 1,300 నుండి రూ 1,500 పెంచేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో ట్రాక్టర్ నీరు ఏకంగా రూ 2,000 అని చెప్పడంతో ప్రజలు షాక్ అయ్యారు. అంత డబ్బులు పెట్టి నీరు కొనుగోలు చెయ్యలేక సామాన్య ప్రజలుు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ఇంటి యజమానులు వారి ఇళ్లలో అద్దెకు ఉంటున్న వాళ్లకు నీరు తక్కువ వాడుకోవాలని, నీరు సరిపోలేదు అంటే మేము ఏమీ చెయ్యలేమని చేతులు ఎత్తేస్తున్నారు.

మహదేవపురలోని కొన్ని ప్రాంతాల్లో వారంలో ఒకసారి, లేదంటే 10 రోజులకు ఒకసారి కావేరీ నీటిని సరఫరా చేస్తున్నారు. ట్రాక్టర్ నీరు రూ 2, 000 పెట్టి కొనుక్కుని ఆ నీరు అద్దెకు ఉంటున్న వారికి ఇవ్వలేక ఇంటి యజమానులు సైతం సతమతం అవుతున్నారు. గత ఏడాది చివరిలో కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చెయ్యడం వలనే బెంగళూరులో తాగునీటి కష్టాలు ఎదురౌతున్నాయని బెంగళూరు ప్రజలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications