సినిమాలు తీసుకోమంటే హిందూ దేవుళ్లతో గేమ్స్ ఆడిన హీరో, సార్ కు సర్ఫ్ ఎక్స్ ఎల్ ఇచ్చిన పోలీస్ !

హిందూ దేవుళ్లను కించపరిచి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్నాడని కన్నడ హీరో చేతన్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు: కన్నడ హీరో, సామాజిక సేవా కార్యకర్త చేతన్ అలియాస్ చేతన్ అహింసను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తూ కన్నడ హీరో చేతన్ మీద బెంగళూరులోని శేషాధ్రిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

మంగళవారం ఉదయం హీరో చేతన్ ఎవరి ముఖం చూశాడో కాని శేషాద్రిపురం పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడానికి పిలుచుకుని వెళ్లారు. కన్నడ హీరో చేతన్ హిందూ ఆరాధ్యదైవం రాముడు, రావణుడు, రామాయణం, ఆయోధ్య, బాబ్రీ మసీదు, టిప్పు సుల్తాన్, ఉరిగౌడ, నంజేగౌడల గురించి అతనికి ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Bengaluru: Kannada film hero Chethan arrested for spreading false propaganda against Hindu gods.

బెంగళూరుకు చెందిన శివకుమార్ అనే ఆయన హీరో చేతన్ సమాజంలో తప్పుడు సంకేతాలు పంపిస్తు శాంతికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అతని మీద శేషాధ్రిపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు వివరాలు తెలుసుకున్న పోలీసులు మంగళవారం బెంగళూరులో కన్నడ హీరో, సామాజిక సేవా కార్యకర్త చేతన్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచడానికి పిలుచుకుని వెళ్లారు.

ప్రతినిత్యం హిందూ దేవుళ్లు, బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుని నిత్యం వివాదాస్పద వ్యఖ్యలు చేస్తున్న కన్నడ హీరో చేతన్ మీద ఇప్పటికే చాలా మంది బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు తక్కువ కావడంతో నటుడు చేతన్ పిచ్చిపట్టినట్లు హిందూ దేవుళ్లను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నాడని ఇప్పటికే చాలా మంది బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇంతకాలం హీరో చేతన్ వియంలో చూసిచూడనట్లు వదిలేసిన బీజేపీ నాయకులు, హిందూ సంఘ సంస్థ కార్యకర్తలు ఇతన్ని ఇలాగే వదిలేస్తే సమాజంలో తప్పుడు సంకేకతాలు పంపిస్తూనే ఉంటాడని చివరికి అతని మీద కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+