జేడీఎస్ ఫైనల్ లిస్ట్, కాంగ్రెస్, బీజేపీ రెబల్ లీడర్స్ కు దళపతుల ఆహ్వానం, రెడ్డికి టిక్కెట్!

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు చిక్కని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు జేడీఎస్ కు జై కొట్టడంతో అనేక నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిపోయింది. నామినేషన్లు వెయ్యడానికి చివరి రోజు కావడంతో గురువారం పలు నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లు తారుమారైనాయి.

నామినేషన్లు వెయ్యడానికి చివరికి రోజు అయిన గురువారం మద్యాహ్నం జేడీఎస్ పార్టీ దళపతులు చివరి లిస్ట్ లో 13 మంది పేర్లు విడుదల చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మంగళూరు ఉత్తర అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించి చివరి నిమిషంలో మోసపోయిన మోహిద్దీన్ బావా ఆ పార్టీ మీద తిరుగుబాటు చెయ్యడంతో గురువారం మద్యాహ్నం ఆయనకు జేడీఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

 kumaraswamy

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పోటీ చేస్తున్న శిగ్లావి నియోజక వర్గంలో జేడీఎస్ అభ్యర్థిగా శశిధరన్ చెన్నప్ప యలిగారను కుమారస్వామి ప్రకటించడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. బెంగళూరులోని పులకేశీ నగరలో నియోజక వర్గం టిక్కెట్ గురువారం వరకు ప్రకటించిన జేడీఎస్ నాయకులు చివరికి అనురాధ పేరును ప్రకటించారు.

బెంగళూరులోని శివాజీనగర్ లో అబ్దుల్లా జాఫర్ ఆలీ, శాంతినగర్ లో మంజునాథ్ గౌడ, మంగళూరు సిటీలో అల్తాఫ్ కుంపాల, బంట్వాళలో ప్రకాష్ రఫాయల్ గూమ్స్, బెళ్తంగడిలో అశ్రఫ్ ఆలీ, భాల్కీలో రైఫ్ పటేల్, యాదగిరిలో ఎబీ. మాలకరెడ్డి, కిత్తూరులో అశ్విని సింగయ్య పూజారా, గోకాక్ లో చెన్నబసప్ప బాళప్పలకు జేడీఎస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వడంతో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+