చిన్నారిపై కన్నతండ్రి అమానుషం: వీడియో తీసిన తల్లి

బెంగళూరు: తన కన్న కుమారుడి పట్ల ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. సెల్‌ఫోన్ చార్జర్‌తో, బెల్టుతో గొడ్డును బాదినట్లు బాదాడు. బెడ్రూంలో కుమారుడిని ఎత్తి విసిరేశాడు. పదేళ్ల కుమారుడిని ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్నాడు.

తల్లి ఈ ఘటనను నివారించకపోగా భర్తకే మద్దతు పలికింది. ఈ సంఘటనను వీడియో తీసింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. యశ్వంతపుర నియోజకవర్గంలోి కెంగేరీ గ్లోబల్ విలేజ్ సమీపంలో మహేంద్ర అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు.

 Bengaluru Man Brutally Kicks, Slams 10-Year-Old Son For Lying

అతని కుమారుడు ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో అల్లరి చేసి, అబద్ధం చెప్పపాడని తండ్రి కుమారుడిని కొట్టాడు. మరోసారి ఇలా చేయనని కుమారుడు కాళ్లావేళ్లా పడిన అతను ఆగలేదు.

అతను ఫోన్ చెడిపోవడంతో దాన్ని మొబైల్ షాపులో మరమ్మతుకు ఇచ్చాడు. మెకానిక్ అందులోని వీడియోను చూసి తీవ్ర ఆవేనకు గురై సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నెటిజన్లు మహేంద్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు సూమోటాగా కేసు నమోదు చేసి మహేంద్రను అరెస్టు చేశారు. కొడుకును కొడుతున్నప్పుడు తన భార్యతో వీడియో తీయించినట్లు అతను అంగీకరించాడు. మరోసారి అల్లరి చేస్తే ఆ వీడియోను చూపించి భయపెట్టడానికే రికార్డు చేసినట్లు చెప్పాడు.

అబద్ధం చెప్పకూడదని ఎన్ని సార్లు నీకు చెప్పాను అని తండ్రి అడుగుతుంటే చాలాసార్లు చెప్పావు అని కుమారుడు భయంతో అనడం వీడియోలో కనిపించింది. వీడియో తీస్తూ ఏ పిల్లాడు కూడా నీలాగా అబద్ధాలు చెప్పడు అని తల్లి అనడం కూడా రికార్డయింది. ఇక ముందు అలా చేయనని, ఈసారి వదిలేయాలని బాలుడు వేడుకుంటున్నా వారు వినలేదు.

ఈ సంఘటన రెండు నెలల క్రితం చోటు చేసుకుంది. బాలుడికి భారీ గాయాలేమీ కాలేదని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+