రెండు రాష్ట్రాల మధ్య వివాదం, అదే జరిగితే మోదీకి లాభం ?, మెట్రో తెచ్చిన తంటాలు !
బెంగళూరు/చెన్నై: కావేరీ నీటి విడుదల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య మళ్లీ వివాదం తలెత్తడంతో ఇరు రాష్ట్రాల మధ్య అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని వెలుగు చూసింది. బెంగళూరు నుంచి హోసూరు ఇండస్ట్రియల్ ఏరియా వరకు మెట్రోరైలు పొడిగించాలని మొదట అనుకున్నారు. అయితే కావేరి దెబ్బతో మెట్రో రైలు మీద ప్రభావం పడింది.
హోసూరు ఇండస్ట్రియల్ ఏరియా వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేసింది. అయితే హోసూరు వరకు మెట్రో రైలు మార్గం పొడిగించాలనే తమిళనాడు ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇప్పుడు బోమ్మసంద్ర వరకే మెట్రో రైలు మార్గం ఏర్పాటు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.

జాతీయ రాజకీయాల పరంగా కాంగ్రెస్, డీఎంకే ఒకే గూటిలో ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు అధికారంలో ఉన్నాయి. భారత ప్రతిపక్ష పార్టీల్లో రెండు పార్టీలు ఉన్నాయి. కానీ కావేరి నీటి విషయంలో కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఒకరికొకరు వ్యతిరేకిస్తూ ప్రవర్తించేలా చేశాయి. కావేరీ నదీ జలాల పంపకం ఇప్పుడు రెండు రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారింది.
కావేరి ట్రిబ్యునల్ ఉత్తర్వుల తీర్పు అంతిమం అయినప్పటికే దానిపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ కర్ణాటకలో సరైన వర్షాలు పడకపోవడంతో కావేరి నీటిని విడుదల చేసే విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కావేరి నీటి కోసం ప్రస్తుతం రెండు రాష్ట్రాలు గొడవపడుతున్నాయి.
ఇప్పుడు తమిళనాడు తన పారిశ్రామిక కేంద్రమైన హోసూర్‌ను సరిహద్దుకు అవతలి వైపున ఉన్న బొమ్మసంద్రకు మెట్రో ద్వారా అనుసంధానించాలనే ప్రతిపాదన మరో వివాదానికి దారితీసింది. ఎలక్ట్రానిక్ సిటీకి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోసూర్ తమిళనాడులో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రాలలో ఒకటి కావడం విశేషం.
కర్ణాటక సరిహద్దు పట్టణం హోసూరును ఇంకా ఎక్కువ అభివృద్ధి చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. హోసూరును బెంగుళూరుకు ఇంకా దగ్గర చెయ్యాలని ప్రయత్నిస్తున్న తమిళనాడు ప్రభుత్వానికి కావేరి నీటి దెబ్బ పడింది. అయితే హోసూరు మెట్రో రైలు మార్గం పొడిగిస్తే కర్ణాటకకు ఇబ్బంది కలిగించే అశంగా మారుతుందని నిపుణలు అంటున్నారు.

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపదానను ఇప్పటికే నిర్వహిస్తున్న బీఐఏఎల్ వ్యతిరేకించింది. కియా నుంచి 150 కి.మీ దూరంలో మరో విమానాశ్రయం లేదని కేంద్రంతో ఒప్పందం కుదిరింది. బీఐఏఎల్ వాదనను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది.
అయితే తమిళనాడు ప్రభుత్వం ముందుకు వెళ్లి సాధ్యాసాధ్యాల అధ్యయన కమిటిని నియమించింది. కావేరి నీటి పంపకాల విషయం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనల వివాదం సరిపోదన్నట్లుగా ఇప్పుడు తమిళనాడు హోసూరు-బొమ్మసంద్ర మధ్య మెట్రో అనుసంధానం ప్రతిపాదన ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది.
బెంగళూరు నమ్మ మెట్రో ఎల్లో లైన్ ఈ సంవత్సరం చివరి నాటికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఆనేకల్ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని బొమ్మసంద్ర వద్ద ముగుస్తుంది. రెండు రాష్ట్రాలను కలుపుతూ దేశంలోనే తొలి అంతర్రాష్ట్ర మెట్రోను తమిళనాడు ప్రతిపాదించింది. తమిళనాడు పారిశ్రామిక హబ్ అయిన హోసూరు నుంచి బెంగళూరుకు అనుసందానం చేస్తూ మెట్రో రైలు ఉండాలని తమిళనాడు కోరుతోంది.
అంతర్ రాష్ట్ర మెట్రో ప్రతిపాదన సాకారమైతే బెంగళూరు మానవ వనరులను, పెట్టుబడులు హోసూరుకు వెళ్లిపోతాయని, తరువాత బెంగళూరులో పెట్టుబడులు కోల్పోయే అవకాశం ఉన్నందున దానిని వ్యతిరేకిస్తున్నట్లు కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. అయితే కావేరి వివాదం మరోసారి తెర మీదకు రావడంతో ఇప్పుడు మెట్రో రైలు విస్తరణ మీద ఆ ప్రభావం పడటంతో తమిళనాడు- కర్ణాటక ప్రభుత్వాల మధ్య మళ్లీ వివాదం మొదలైయ్యింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications