Aamir Khan: ఆన్ లైన్ గేమ్ కు అలవాటు, పోలీసులకే నాన్న పులి కథ చెప్పాడు, అమీర్ ఖాన్ అందర్ !
ఆన్ లైన్ గేమ్ తో పోలీసులనే మోసం చేసిన అమీర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏదో చెయ్యాలని అనుకుని పోలీసులకు నాన్న పులి కథ చెప్పిన అమీర్ ఖాన్ జైలుపాలైనాడు.
బెంగళూరు/దావణగెరె: ఆన్ లైన్ గేమ్, రమ్మీ, మమ్మీ, తుమ్మి అంటూ ఇలా రకరకాల పేర్లతో ఆన్ లైన్ గేమ్స్ తో యువతను కొన్ని యాప్ప్ చెడగొడుతున్నాయి. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తరువాత కొంత మంది యువకులకు చేతులు ఉలఉలా తులతులా అంటుంటాయి. ఆన్ లైన్ గేమ్స్ మొబైల్ యాప్స్ కు తోడు ఫోన్ పే. గూగుల్ పే అంటూ మనీ ట్రాన్సఫర్ సదుపాయం కూడా ఫోన్లలో ఉండటంతో యువత అడ్డు అదుపులేకుండా చెడుదార్లు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆన్ లైన్ గేమ్ తో పోలీసులనే మోసం చేసిన అమీర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

భలే చెప్పాడు
ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు పోగొట్టుకున్న యువకుడు తనను ముగ్గురు వ్యక్తులు కత్తి చూపించి బెదిరించారని, తరువాత తన మొబైల్ ఫోన్ లాక్కొని 35 వేల రూపాయలను పోన్ పే ద్వారా డబ్బులు వేరే అకౌంట్ కు ట్రాన్సఫర్ చేయించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పుడు కేసు పెట్టిన నిందితుడిని కర్ణాటకలోని దావణగెరు నగరంలోని ఆజాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అమీర్ ఖాన్ నాటకాలు
దావణగెరె నగరంలోని ఎస్‌ఎస్‌ఎం నగర్ ఏ బ్లాక్‌లో అమీర్ ఖాన్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నిందితుడు అమీర్ ఖాన్ కు ఆన్ లైన్ గేమ్ ఆడటం అలవాటు అయ్యింది. ఆన్ లైన్ గేమ్ కు బానిస అయిన అమీర్ ఖాన్ అతని మొబైల్ లో ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయాయని ఇంట్లో తెలిస్తే తన తండ్రి చితకబాదుతాడని అమీర్ ఖాన్ భయపడ్డాడు.

దోపిడి కథ అల్లిన ఆమీర్ ఖాన్
జనవరి 30వ తేదీ సాయంత్రం నిర్జన ప్రదేశంలో తాను నడుచుకుని వెలుతుంటే ముగ్గురు వ్యక్తులు అడ్డగించి కత్తితో బెదిరించారని, తరువాత తను ఎవ్వరూ లేని ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి తన మొబైల్ లాక్కొన్నారని, ఫోన్ పే ద్వారా తన అకౌంట్ లో ఉన్న 35 వేల రూపాయలు వేరే ఖాతాకు బదిలి చేసుకున్నారని కేటుగాడు అమీర్ ఖాన్ దావణగెరెలోని ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు.

జైల్లో అమీర్ ఖాన్
డీవైఎస్పీ మల్లేష్ దొడ్మాని ఆధ్వర్యంలో ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇమ్రాన్ బేగ్, సిబ్బంది విచారణ చేపట్టారు. అమీర్ ఖాన్ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తేలింది. నిందితుడు అమీర్‌ఖాన్‌ను పట్టుకుని విచారించగా ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పెట్టి ఓడిపోయాడని, తన తండ్రి కొడతాడని అబద్ధం చెప్పి ఫిర్యాదు చేశానని అంగీకరించాడు. తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులకు పక్కదారి పట్టించాడని ఆరోపిస్తూ అమీర్ ఖాన్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.
-
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications