"మేడం ఇటు చూడండి".. మహిళ ముందే యువకుడు హస్తప్రయోగం..

బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన ఓ మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మేడం అని పిలిచాడు.. వెనక్కు తిరిగి చూడగా.. ఆమె ముందే హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని ఇందిరానగర్ లోని ఓ పార్కులో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

బెంగళూరులోని ఇందిరా నగర్, దోమ్లూర్ సెకండ్ స్టేజ్, ఫిఫ్త్ మెయిన్ రోడ్ పరిధిలోని ఓ పార్కులో నవంబర్ 1 న షాకింగ్ ఘటన జరిగింది. ఓ 33 ఏళ్ల మహిళ ఉదయం 11 గంటల సమయంలో రోజూలాగే తన పెంపుడు కుక్కతో వాకింగ్ కు వెళ్లింది. అయితే అక్కడో బ్రౌన్ కలర్ పోలో షర్ట్, గ్రే కలర్ జిప్ షార్ట్స్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి.. సదరు మహిళను మేడం అని పిలిచాడు. దీంతో ఆమె అతడివైపు చూడగా.. వెంటనే ప్యాంట్ విప్పి హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీంతో అతడి ప్రవర్తనతో భయాందోళనకు గురైన ఆ మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసుకున్నారు. సెక్సువల్ హరాష్ మెంట్ కింద నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం సీసీటీవీలను పరిశీలించి నిందితుడ్ని పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. మహిళలు ఇలాంటి సంఘటనలను ఎదుర్కుంటే వెంటనే 112 కు డయల్ చేయాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Bengaluru Morning Horror Man Caught Masturbating in Front of Jogger FIR Filed

చైల్డ్‌ లైన్ ఇండియా - 1098; తప్పిపోయిన పిల్లలు, మహిళలు - 1094; మహిళల హెల్ప్‌ లైన్ - 181; నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హెల్ప్‌ లైన్ - 112; హింసకు వ్యతిరేకంగా జాతీయ మహిళా కమీషన్ హెల్ప్‌ లైన్ - 7827170170; పోలీసు మహిళలు , సీనియర్ సిటిజన్ హెల్ప్‌ లైన్ - 1091/1291.. నెంబర్లకు సంప్రదించాలని పోలీసులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+